Movies'ఆచార్య‌ ' కు సానా క‌ష్టం వ‌చ్చింది.. మార్నింగ్ షోలు, మ్యాట్నీలు...

‘ఆచార్య‌ ‘ కు సానా క‌ష్టం వ‌చ్చింది.. మార్నింగ్ షోలు, మ్యాట్నీలు క్యాన్సిల్‌…!

మెగాస్టార్ చిరంజీవి ఆచార్యకు అసలైన పరీక్ష మొదలైంది. అస‌లు ఫ‌స్ట్ డే నే సినిమా తేలిపోయింది. తెలంగాణ‌లో చాలా మంది టిక్కెట్లు బుక్ చేసుకుని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక రెండో రోజు ప‌రిస్థితి మ‌రీ ఘోరం. డ‌బుల్ థియేట‌ర్లు క్యాన్సిల్ అయిపోయాయి. మ‌ల్టీఫ్లెక్స్‌ల్లో కొన్ని స్క్రీన్ల‌లో ఆచార్య లేపేని త్రిబుల్ ఆర్‌, కేజీయ‌ఫ్ 2 ఆడించేస్తున్నారు. ఇటు ఏపీలోనూ చాలా చోట్ల అదే ప‌రిస్థితి ఉంది.

ఇక ఆదివారం కూడా సినిమాకు సానా క‌ష్టం వ‌చ్చేసింది. తెలంగాణ‌లో ప‌లు బీ, సీ సెంట‌ర్ల‌లో మార్నింగ్ షోలు, మ్యాట్నీలు ర‌ద్ద‌య్యే ప‌రిస్థితి వ‌చ్చిందంటే సినిమా ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అస‌లే సినిమా ప్లాప్ టాక్ ఓ వైపు.. మ‌రో వైపు ప‌రీక్ష‌లు… మండుతోన్న ఎండ‌లు.. దీంతో సోమ‌వారం నుంచి ఈ సినిమా ఎలా ర‌న్ అవుతుందో ఎవ్వ‌రికి అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

అస‌లే సినిమా బాగోలేద‌నుకుంటే.. ఈ సినిమా రిలీజ్ టైం కూడా పెద్ద రాంగ్ డెసిష‌న్ అంటున్నారు. తొలి రోజు ఆచార్య‌కు రు. 33 కోట్ల షేర్ వ‌చ్చింద‌న్నారు. రెండో రోజు తొలి రోజు వ‌చ్చిన షేర్‌లో నాలుగో వంతు అంటే క‌నీసం రు. 8 కోట్లు కూడా రాలేదు. ఆదివారం అయితే మ‌రీ ఘోరం. అస‌లు ఓ పెద్ద హీరో సినిమాకు ఫ‌స్ట్ వీకెండ్ ఆదివారం రావాల్సిన వ‌సూళ్ల‌లో ప‌ది శాతం వ‌సూళ్లు కూడా రాలేదు.

ఇటీవ‌ల కాలంలో ఓ పెద్ద సినిమాకు ఎప్పుడూ లేనంత స్థాయిలో ఆచార్య‌కు వ‌సూళ్లు త‌క్కువ వ‌చ్చాయి. ఇక ఆదివారం సినిమా చూసేందుకు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారిలోనూ చాలా మంది క్యాన్సిల్ చేసుకున్నారు. దీనికి తోడు పెరిగిన టిక్కెట్ రేట్లు కూడా సినిమాపై ప్ర‌భావం చూపించాయ‌ని అంటున్నారు.

ఇంత ఎక్కువ టిక్కెట్ రేట్ల‌తో ప్లాప్ సినిమా చూసేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీంతో ఆదివార‌మే మార్నింగ్ షోలు, మ్యాట్నీలు క్యాన్సిల్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. పైగా సోమ‌వారం నుంచి వీక్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి. దీంతో ఆచార్య ప‌రిస్థితి మ‌రింత ఘోరంగా ఉంటుంద‌ని అంటున్నారు. సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు ఆచార్య ఎలా న‌డుస్తుందో ? ఊహ‌కే అంద‌డం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news