సీనియర్ హీరో అరవింద్ స్వామి.. ఈ తరం జనరేషన్ హీరోలకు ఈయన గురించి తక్కువ తెలుసు కాని.. రెండున్నర దశాబ్దాల క్రిందట బొంబాయి, రోజా సినిమాలతో అప్పటి తరం యువత కలల హీరో అయిపోయాడు. అలాగే అరవింద స్వామి అందానికి అప్పటి అమ్మాయిలు పడి చచ్చేవారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా అరవింద స్వామి ఉండేవారు. రజనీకాంత్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమాతో అరవింద స్వామి హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు.
మధ్యలో కుర్ర హీరోల పోటీ తట్టుకోలేక కొద్ది కాలం పాటు సినిమాలకు దూరమై బిజినెస్‌లోకి వెళ్లాడు. అక్కడ కూడా బాగా సక్సెస్ అయ్యాడు. అయితే చాలా రోజుల తర్వాత తనీ ఒరువన్ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు. స్టైలీష్ విలన్‌గా అరవింద్ నటనకు మళ్లీ తమిళ జనాలు జేజేలు పలికారు. అదే సినిమాను తెలుగులో రామ్ చరణ్ హీరోగా ధృవ పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా అరవింద స్వామియే విలన్‌గా చేశాడు. అలా చాన్నాళ్లకు ఓ మాంచి పాత్రలో చూసే అదృష్టం దక్కింది.
ఇటీవలే తలైవి మూవీలో ఎంజీఆర్ రోల్లో అరవింద స్వామి నటించాడు. అయితే అరవింద్ స్వామి భార్య అపర్ణ ముఖర్జీ గురించి తక్కువ మందికే తెలుసు. అయితే ఆమె చాలా ఫేమస్ అన్నది తక్కువ మందికి మాత్రమే తెలుసు. దేశంలోనే ప్రముఖ న్యాయవాదుల్లో అపర్జా ముఖర్జీ ఒకరు. ఆమెకు విదేశాల్లో కూడా న్యాయవాదిగా వాదించే లైసెన్స్ ఉంది. ఆమె దేశంలో పలు కార్పోరేటర్ కంపెనీలతో పాటు బడా పారిశ్రామిక వేత్తలకు కూడా న్యాయ సేవలు అందిస్తూ ఉంటారు.
అంతేకాకుండా అపర్జ ముఖర్జీ అరవింద్ స్వామికి చెందిన కంపెనీలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గాను.. పలు బడా కంపెనీలకు లీగల్ అడ్వైజరీగాను పని చేస్తున్నారు. అలాగే సొంత కంపెనీల నుంచే ఆమెకు వాటాల రూపంలో కూడా భారీ ఆదాయం దక్కనుందట. ఆమెకు పలు కంపెనీల్లో భారీ ఎత్తున వాటాలు కూడా ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే అపర్జా ముఖర్జీకి నెలకు రు. 30 – 35 కోట్ల ఆదాయం వస్తుందట. ఓ స్టార్ హీరోకు భార్యగా ఉన్నా కూడా ఆయనకు మించిన ఆస్తులు కూడ బెడుతుండడంతో అపర్జా ముఖర్జీ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు.