ప్రస్తుతం ఇండియాలో సెలబ్రిటీల ఆదాయానికి అంతే లేదు. ఒక్కో సెలబ్రిటీ రెండు, మూడు రకాలుగా ఆదాయాలు సంపాదిస్తున్నారు. అయితే వారసత్వంగా వచ్చిన ఆస్తులతో రిచ్చెస్ట్ అనిపించుకోవడం కన్నా తమ సొంత సంపాదనతోనే రిచ్చెస్ట్ సెలబ్రిటీలుగా ఉండడం గొప్ప విషయం. సొంత సంపాదనతో రిచ్చెస్ట్ సెలబ్రిటీలుగా ఉండేవారికి క్రేజ్ వేరుగా ఉంటుంది.
సినిమాలు, క్రికెట్లో రాణించే వారు రకరకాలుగా ఆదాయ మార్గాలను ఎంచకుంటూ సంపాదన భారీగా వెనకేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే వ్యక్తిగత సంపాదన పరంగా మోస్ట్ రిచ్చెస్ట్ సెలబ్రిటీలుగా ఉన్నారు విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ దంపతులు. గత దశాబ్ద కాలంగా ఈ దంపతులు తమ రంగాల్లో ఎంత గొప్పగా ఎదిగారో చూస్తూనే ఉన్నాం.
అనుష్క ఇటు సినిమా రంగంలో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతూ వచ్చింది. అటు కోహ్లీ స్టార్ క్రికెటర్ రేంజ్ నుంచి భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎదిగాడు. ఓ యాడ్ షూటింగ్ సందర్భంగా ప్రేమలో పడిన వీరు చాలా కాలం ప్రేమలో మధురానుభూతులు అనుభవిస్తూ దంపతులు అయ్యారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరు తమ తమ కెరీర్‌లో చాలా బిజీగా ఉంటున్నారు. అంతే కాకుండా ఇప్పుడు వీరు తమ సొంత సంపాదనతోనే ఇండియాలోనే రిచ్చెస్ట్ సెలబ్రిటీ దంపతులుగా నిలిచారు.
అసలు వీరి ఆస్తులు కళ్లు చెదిరిపోయే రేంజ్‌లో ఉన్నాయి. జాయింటుగా చూస్తే వీరి ఆస్తుల విలువ వందల కోట్లలోనే ఉందట. విరాట్ కోహ్లీ స్టార్ క్రికెటర్. మనోడి మ్యాచ్ ఫ్యీజులు.. ఎండోర్స్‌మెంట్ ఒప్పందాలు.. వార్షిక రాబడులు చూసుకుంటే యేడాదికి వంద కోట్ల పైమాటే. ఇక అనుష్క హీరోయిన్‌గానే కాకుండా.. అటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. అలాగే ఆమె క్లాత్ బ్రాండ్‌కు ఓనర్.. నుష్ పేరుతో వస్త్రాల బిజినెస్ చేస్తోంది. దాని విలువే రు. 65 కోట్లు ఉంటుందని అంచనా.
ఇక గుర్గావ్‌లో కోహ్లీకి సొంతంగా బంగ్లా ఉంది. దాని విలువే రు. 80 కోట్లు. ఇక అనుష్కకు రు. 4 కోట్ల లాండ్ రోవర్ కారు ఉంది. విరాట్‌కు కూడా ఒక్కోటి రు. 4 కోట్లు విలువ చేసే రెండు కార్లు ఉన్నాయి. ఇక అనుష్కకు ముంబైలో ట్రిఫ్లెక్స్ అపార్ట్‌మెంట్ ఉంది. దాని విలువే రు. 10 కోట్లు అని అంచనా. ఆమెకు ముంబై అంథేరీలో రు. 4 కోట్ల విలువైన మరో ఇల్లు కూడా ఉంది. ఇక లగ్జరీ వాచ్‌లు, ఖరీదైన హ్యాండ్ బ్యాగులు వీరి సొంతం. వీటి విలువే కోట్లలో ఉంటుందట.
ఇక ఈ దంపతులకు ముంబైలో జాయింటుగా ఓ ఫోర్ బెడ్రూమ్ అపార్ట్‌మెంట్ ప్లాట్ ఉంది. దీని విలువ చుక్కలను అంటే రేంజ్‌లో రు. 34 కోట్లు ఉంటుందట. అనుష్క – విరాట్ దంపతుల ఆస్తుల్లో మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. ఇంకా వీరి ఆస్తులు పలు రంగాల్లో పెట్టుబడుల రూపంలో విస్తరించి ఉన్నాయి.