Movies' అఖండ ' ఖాతాలో మ‌రో రేర్ రికార్డ్‌... బాల‌య్య ఒక్క‌డికే...

‘ అఖండ ‘ ఖాతాలో మ‌రో రేర్ రికార్డ్‌… బాల‌య్య ఒక్క‌డికే సొంతం…!

ఇటీవ‌ల కాలంలో సినిమాలు రెండు, మూడు వారాల పోస్ట‌ర్లు ప‌డితేనే గొప్ప‌. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఒక‌టి లేదా రెండు వారాలు. మూడో వారం పోస్ట‌ర్ ఉండ‌డం లేదు. ఒక‌ప్పుడు ఒక జిల్లాకు ఐదారు స్క్రీన్లు మాత్ర‌మే వేసేవారు. ఇప్పుడు ఏకంగా 40 సెంట‌ర్ల‌లో రిలీజ్‌లు ప‌డుతుంటే.. సిటీలో అయితే సినిమా రిలీజ్ రోజు ఎన్ని థియేట‌ర్లు ఉంటే అన్ని థియేట‌ర్ల‌లోనూ ఈ సినిమాను వేసేస్తున్నారు. దీంతో ఓపెనింగ్స్ అదిరిపోతున్నా.. త‌ర్వాత సినిమాలో దమ్ము లేక‌పోతే లాంగ్ ర‌న్ ఉండ‌డం లేదు.

పైగా సినిమా రిలీజ్ అయిన నెల రోజుల‌కే ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఓటీటీల్లోకి, టీవీల్లోకి వ‌చ్చేస్తుండ‌డంతో ఎవ్వ‌రూ కూడా థియేట‌ర్ల‌లో చూసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో 50 రోజులు ఆడ‌డం అంటే 100 రోజులో, 200 రోజులో ఆడినంత గొప్ప‌గా ఫీల‌వుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌రోనా క‌ష్టాల్లో కూడా డేర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నట‌సింహం బాల‌య్య అఖండ సినిమా థియేట‌ర్ల‌ను ఊపేసింది.

అఖండ 103 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. డిసెంబ‌ర్ 2న వ‌చ్చిన అఖండ ఆ త‌ర్వాత వ‌చ్చిన పుష్ప‌, సంక్రాంతికి వ‌చ్చిన బంగార్రాజు సినిమాలు ఉన్నా కూడా ఇన్ని కేంద్రాల్లో 50 రోజులు ఆడ‌డం పెద్ద సంచ‌ల‌నం అయ్యింది. అదే ఊపులో 4 డైరెక్టు కేంద్రాల్లో 100 రోజులు.. షిఫ్టుల‌తో కలుపుకుని 20 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఒక్క క‌ర్నూలు జిల్లాలోనే అఖండ 3 కేంద్రాల్లో 100 రోజులు ఆడ‌డంతో అక్క‌డే శ‌త‌దినోత్స‌వ ఫంక్ష‌న్ కూడా చేశారు.

ఇక అఖండ ఇప్ప‌ట‌కీ ఓ థియేట‌ర్లో కంటిన్యూ అవుతూ 175 రోజులు పూర్తి చేసుకుంది. ఆ థియేట‌ర్ ఏదో కాదు.. నంద‌మూరి హీరోల సినిమాల‌కు అడ్డా అయిన గుంటూరు జిల్లా ( ఇప్పుడు పల్నాడు జిల్లా) చిల‌క‌లూరిపేట‌. ఈ ప‌ట్ట‌ణంలోని రామ‌కృష్ణ థియేట‌ర్లో 175 రోజులు పూర్తి చేసుకుని 200 రోజుల వైపు ప‌రుగులు పెడుతోంది. ఈ థియేట‌ర్లో అఖండ 200 కంప్లీట్ అయ్యాకే కొత్త సినిమా తెస్తార‌ట‌.

సినిమా 200 రోజులు పూర్త‌య్యాక బాల‌య్య‌ను ముఖ్య అతిథిగా తీసుకువ‌చ్చి ఫంక్ష‌న్ చేస్తామ‌ని థియేట‌ర్ య‌జ‌మానులు చెపుతున్నారు. ఇక బాల‌య్య – బోయ‌పాటి కాంబోలో సింహా, లెజెండ్ త‌ర్వాత అఖండ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యి హ్యాట్రిక్ కొట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news