అనిల్ రావిపూడి వరుస హిట్లతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లీగ్‌లోకి వెళ్లిపోయాడు. ఫస్ట్ సినిమా పటాస్‌తో మొదలు పెడితే రాజా ది గ్రేట్ – సుప్రీమ్ – ఎఫ్ 2 – సరిలేరు నీకెవ్వరు – ఇప్పుడు ఎఫ్ 3.. ఎఫ్ 3 కూడా హిట్ లక్షణాలు కనపడడంతో అనిల్ డబుల్ బ్లాక్‌బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఎఫ్ 3 తర్వాత అనిల్ రావిపూడి నెక్ట్స్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఓ అవుట్ & అవుట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి అసలు సినిమాల్లోకి రావడానికి కారణం తన కజినే. తన పెదనాన్న కుమారుడు ఓ ఫేమస్ డైరెక్టర్. బాలయ్య, పవన్ కళ్యాణ్‌తో సినిమాలు కూడా చేశాడు. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు పిఏ. అరుణ్ ప్రసాద్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తమ్ముడు లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత బాలయ్యతో భలేవాడివి బాసు సినిమాను కూడా డైరెక్ట్ చేశారు.
తమ్ముడు తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆరుణ్ ప్రసాద్ అప్పటికే నరసింహానాయుడు లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి ఉన్న బాలయ్యతో ఈ సినిమా తెరకెక్కించారు. పాజిటివ్ అంచనాల మధ్య వచ్చిన ఈ యాక్షన్ కామెడీ డ్రామా.. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా బాలయ్య అభిమానులను మురిపించింది. పైసా వసూల్లో మనం సరికొత్త బాలయ్యను ఎలా చూశామో ఈ సినిమాలో కూడా అలాంటి బాలయ్యనే చూశాం. అంజలా ఝవేరి, శిల్పాశెట్టి హీరోయిన్లుగా నటించారు. 2001 జూన్ 15న విడుదలై మ్యూజికల్ గా మెప్పించింది. సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి.
అరుణ్ ప్రసాద్ స్ఫూర్తితోనే అనిల్ రావిపూడి డైరెక్టర్ అయ్యాడు. ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. తర్వాత రైటర్‌గా.. డైరెక్టర్‌గా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. ఏపీ ఆరుణ్ ప్రసాద్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన అనిల్ ముందు ఆకుల శివ అనే రచయిత దగ్గర కొద్ది రోజులు పనిచేశారు. తర్వాత శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తూ దిల్ రాజు కాంపౌండ్‌లో కూడా కొంత వర్క్ చేశాడు.
అనిల్ చెప్పిన పటాస్ కథ నచ్చడంతో నందమూరి కళ్యాణ్‌రామ్ ఆ సినిమా నిర్మించేందుకు ముందుకు రావడంతో పాటు ఆ మంచి కథ తనతో వద్దని పెద్ద హీరోతో వీలుంటే ఎన్టీఆర్‌తో చేద్దామన్నాడు. కానీ అనిల్ మాత్రం తనకు డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్‌రామ్‌తోనే చేయాలని ఫిక్స్ అయ్యి హిట్ కొట్టాడు. ఆ తర్వాత అనిల్‌కు తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ ఆస్థాన డైరెక్టర్ అయిపోయాడు.
ఇక తన అన్న పీఏ ఆరుణ్ ప్రసాద్ బాలయ్యతో భలేవాడివి బాసు సినిమా చేశాడు. ఇక ఇప్పుడు తమ్ముడు అనిల్ కూడా సినిమాకు రెడీ అవుతున్నాడు. మరి అనిల్ బాలయ్య లాంటి యాక్షన్ హీరోను తనదైన మేకోవర్‌లోకి ఎలా మార్చుకుని చూపిస్తారో ? చూడాలి.