Moviesక‌ళ్లు చెదిరే డ‌బ్బులు... విజ‌య్ సినిమాకు స‌మంత రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా...!

క‌ళ్లు చెదిరే డ‌బ్బులు… విజ‌య్ సినిమాకు స‌మంత రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా…!

స‌మంత‌కు విడాకుల త‌ర్వాత ఈ రేంజ్ క్రేజ్ ఉంటుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు. అస‌లు చైతుతో పెళ్ల‌య్యి మ‌జిలీ సినిమాలు చేస్తోన్న టైంలో స‌మంత మ‌హా అయితే మ‌రో మూడు నాలుగు సినిమాలు చేసి త‌ట్టాబుట్టా స‌ర్దేసుకోవాల‌నే అంద‌రూ అన్నారు. క‌ట్ చేస్తే విడాకుల త‌ర్వాత ఆమె స్టార్ హీరోల‌కు పోటీ ఇస్తూ వ‌రుస‌పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతోంది. విడాకుల త‌ర్వాతే ఆమె పుష్ప‌లో ఐటెం సాంగ్ చేసింది. కోలీవుడ్ సినిమా కేఆర్కే రిలీజ్ అయ్యింది.

ఇక ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌స్తోన్న ఖుషీ సినిమా చేస్తోంది. అటు బాలీవుడ్‌లో రెండు హాట్ వెబ్‌సీరిస్‌ల‌కు ఓకే చెప్పింది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే స‌మంత క్రేజ్ మామూలుగా లేదు. మ‌రోవైపు హాలీవుడ్ ట్రైల్స్ కూడా మామూలుగా లేవు. మ‌రోవైపు ఆమె తెలుగులో న‌టించిన థ్రిల్ల‌ర్ మూవీ య‌శోద ఆగ‌స్టు 12న వ‌స్తోంది.

గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆమె న‌టించిన శాకుంత‌లంపై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే స‌మంత ఫామ్‌లో ఉన్న‌ప్పుడే ఒక్కో సినిమాకు రు. 2 కోట్ల లేదా కాస్త పైన తీసుకునేది. ఒక‌ప్పుడు స‌మంత‌కు వ‌రుస‌గా ఆఫ‌ర్లు రావ‌డంతో ఆమె రెమ్యున‌రేష‌న్ ప‌రంగా టాప్ ప్లేసులోకి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు వ‌య‌స్సు మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో ఉంది.

పెళ్ల‌య్యింది.. విడాకులు అయిపోయాయ‌ని చెప్పినా ఎవ్వ‌రూ న‌మ్మ‌లేనంత ఆక‌ర్ష‌ణ‌తో ఉంది. మామూలుగా అయితే ఇంత మంది కుర్ర హీరోయిన్ల పోటీ నేప‌థ్యంలో స‌మంత రెమ్యున‌రేష‌న్ త‌గ్గాలి. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఆమె చేస్తోన్న సినిమా రెమ్యున‌రేష‌న్ చుక్క‌ల్లోనే ఉంది. ఈ సినిమాకు ఆమె ఏకంగా రు. 4.5 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది.

స‌మంత ఇప్పుడు సినిమా చేసినా జ‌నాలు చూస్తారు. ఇక ఆమె కూడా త‌న‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాల‌ని ఏమోగాని రేట్ ఫామ్‌లో ఉన్న‌ప్ప‌టి కంటే బాగా పెంచేసింద‌నే అంటున్నారు. పైగా పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌స్తోన్న ఈ సినిమాతో తానేంటో ఫ్రూవ్ చేసుకోవాల‌ని ఆమె గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తోనే ఉంది.

Latest news