అల్లు వారి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ హీరో అయిపోయాడు. స్టైలీష్ స్టార్‌గా పాపులారిటీ తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు ఏకంగా ఐకాన్ స్టార్ అయిపోయాడు. 2003లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయిన బన్నీ రెండో సినిమా ఆర్యతో అదరగొట్టేశాడు.
ఆర్య నుంచి బన్నీ ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. రెండేళ్ల క్రితం సంక్రాంతికి సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోటీ పడి మరి అల వైకుంఠపురంతో ఇండ్ట్రీ హిట్ కొట్టడమే కాదు.. నాన్ బాహుబలి రికార్డులు సైతం సెట్ చేశాడు. ఇక గతేడాది చివర్లో కరోనా ప్రభంజనంలోనూ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా ? రారా ? అన్న సందేహాలు పటాపంచలు చేస్తూ పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
పుష్ప అయితే ఏకంగా పాన్ ఇండియా లెవల్లో హిట్ అవ్వడంతో పాటు బన్నీని పాన్ ఇండియా హీరోను చేసేసింది. పుష్ప దెబ్బకు బన్నీకి బాలీవుడ్‌లోనూ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు అందరూ పుష్ప2 వైపే ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. బన్నీ తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు. అయితే ఏ హీరోయిన్‌తో బన్నీకి రూమర్ లేదన్న సంగతి తెలిసిందే.
బన్నీపై ఎప్పుడూ ఈ తరహా వార్తలు రాలేదు. బన్నీ ప్రముఖ వ్యాపారవేత్త, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నాయకుడు ప్రభాకర్ రెడ్డి కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ తన భార్యతో పాటు పిల్లలతో కలిసి సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటాడు.
బన్నీ స్నేహారెడ్డి కంటే ఓ హీరోయిన్ను ప్రేమించాడట. ఆ హీరోయిన్ ఎవరో కాదు అందాలతార ఐశ్వర్యారాయ్. ఐశ్వర్య అంటే తనకు చాలా ఇష్టం అని.. ఆమె పెళ్లికి ముందు ఆమెను బాగా ఇష్టపడేవాడిని అని.. అయితే ఆమె అభిషేక్నుపెళ్లి చేసుకున్నప్పుడు తాను చాలా బాధపడ్డానని బన్నీ కాస్త బాధపడుతూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.