Movies' స‌ర్కారు వారి పాట ' అడ్వాన్స్ బుకింగ్‌... 58 నిమిషాల్లో...

‘ స‌ర్కారు వారి పాట ‘ అడ్వాన్స్ బుకింగ్‌… 58 నిమిషాల్లో మ‌హేష్‌ ఇండ‌స్ట్రీ రికార్డు బ్రేక్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటించిన ‘సర్కారు వారి పాట అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ శుక్ర‌వారం ( మే 12న ) బాక్సాఫీస్ మీద దండ‌యాత్ర‌కు రెడీ అవుతోంది. మ‌హేష్‌బాబు సినిమా వ‌స్తుందంటే అంచ‌నాలు ఎంత తారాస్థాయిలో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పైగా మ‌హేష్ భ‌ర‌త్ అనే నేను – మ‌హ‌ర్షి – స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో స‌ర్కారు వారి పాట సినిమాపై స్కై రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి.

అటు గీత‌గోవిందం త‌ర్వాత ప‌ర‌శురాం డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌ర్కారు హీట్ మామూలుగా లేదు. స‌ర్కారు రిలీజ్‌కు మ‌రో ఒక్క రోజు మాత్ర‌మే ఉంది. అడ్వాన్స్ బుకింగ్ అలా ఓపెన్ అయ్యాయో లేదో వెంట‌నే రికార్డు స్థాయిలో బుకింగ్స్ న‌మోదు అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏ టాలీవుడ్ సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు కాని విధంగా స‌ర్కారు వారి పాట 58 నిమిషాల్లోనే స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

మ‌హేష్‌బాబు సినిమాకు ఓవ‌ర్సీస్‌లో మామూలు క్రేజ్ ఉండ‌దు. ఆరు సినిమాలు వ‌రుస‌గా అక్క‌డ మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేశాయి. ఇక స‌ర్కారు సినిమాకు ఇప్ప‌టికే అక్క‌డ 362 లొకేషన్ల‌లో 1046 షోల ద్వారా 448K డాలర్లు వసూలు చేసింది. ఫ‌స్ట్ షో ప‌డే టైంకే ఈ సినిమాకు ఓవ‌ర్సీస్‌లో 1 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు సులువుగా వ‌చ్చేలా ఉన్నాయి. ఇక రెండేళ్ల త‌ర్వాత మ‌హేష్ చేస్తోన్న సినిమా కావ‌డంతో ఏపీ, తెలంగాణ‌లోనూ సంద‌డి మామూలుగా లేదు.

ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాలు ప‌ది రోజుల పాటు టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు, ఐదో షో వేసుకునేందుకు అధికారికంగానే అనుమ‌తులు ఇవ్వ‌డంతో భారీ ఎత్తున బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. హైద‌రాబాద్‌లో బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయో లేదో వెంట‌నే ఈ సినిమ రు. 3 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. పైగా కేవ‌లం 58 నిమిషాల్లోనే ఈ సినిమాకు 1 కోటి గ్రాస్ రావ‌డం రికార్డు అనే చెప్పాలి.

ఇటీవ‌ల రిలీజ్ అయిన సినిమాల్లో రాధేశ్యామ్ ( 1 రోజు) , ఆచార్య ( 2 రోజులు), భీమ్లానాయ‌క్ ( 3 రోజులు ) కు కోటి గ్రాస్ వ‌చ్చాయి. అస‌లు ఆ సినిమాల‌తో పోలిస్తే 58 నిమిషాల్లోనే కోటి గ్రాస్ వ‌సూళ్లు అంటే సినిమాపై ఏ స్థాయిలో అంచ‌నాలు ఉన్నాయో తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కు మ‌రో రెండు రోజుల టైం ఉండ‌డంతో ఈ గ్రాస్ వ‌సూళ్లు డ‌బుల్ అవుతాయ‌ని అంచ‌నాలు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news