Moviesచరణ్ కి అంత సీన్ లేదు.. తారక్ ని మించిన వాడు...

చరణ్ కి అంత సీన్ లేదు.. తారక్ ని మించిన వాడు ఇండస్ట్రీలోనే లేడు.. కోట కామెంట్స్ వైరల్..!!

సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు ఈ మధ్య సినిమాల్లో కనిపించడం మానేశారు. బదులుగా కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తూ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. మొన్న ఆ మధ్య జబర్ధస్త్ యాంకర్ అనసూయ బట్టల గురించి మాట్లాడి సంచలన వ్యాఖ్యలు చేసిన ఈయన.. ప్రజెంట్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన్నట్లు ఉన్నారని ఆయన మాటల బట్టి తెలిసిపోతుంది. కెరీర్ లో ఎంతో మంది హీరోలతో..మూడు జనరేషన్ లను కవర్ చేసిన ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతుంది.

కోట శ్రీనివాస రావు మాట్లాడుతూ..”కోట్లు పారితోషకాని తీసుకుంటూ కూడా నేను కార్మికుడుని అని చిరంజివీ చెప్పుకోవడం సరికాదు. నువ్వు అంత సంపాదిస్తున్నా..సినీ కార్మికులకు నువ్వు చేసింది ఏం లేదు. ఏదో చిత్రపూరి లో హాస్పిటల్స్ కట్టిస్తా అన్నావు. ఆసుపత్రి ఎవరికి కావాలి, ఫుడ్డు పెట్టించు” అంటూ ఘాటుగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..చిరంజీవి కొడుకు రామ్ చరణ్ పై కూడా ఫైర్ అయ్యారు. ” అస్సలు చిరంజీవి లేకుంటే ఆయన కోడుకు ఇండస్ట్రీలో నిలబడలేడు. ఆయన పేరుతో ఇంత వరకు వచ్చారు. అంతే తప్ప నటుడిగా చరణ్ లో చెప్పుకో తగ్గ క్వాలిటీస్ లేవు. అస్సలు ఆయనలో ఆ పొటెన్షియాలిటీనే లేదు” అంటూ మెగా ఫ్యామిలీ హీరో పరువు తీసేశాడు.

అదే సమమ్యంలో తారక్ ని ఓ రేంజ్ లో పొగిడేశారు. “ఇండస్ట్రీ లో తారక్ ని మించిన వాడు లేడు. ఆయన స్టైల్, డ్యాన్స్, నటన, వాక్చాతుర్యం..గురించి ఎంత చెప్పినా తక్కువే. మెయిన్ గా ఒ నటుడికి కావాల్సిన క్వాలిటీలు అన్నీ తారక్ లో పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి డైలాగ్ అయినా అదరగొడతాడని నటనలో తాతకు తగ్గ మనవడిగా బాగా నటిస్తాడు. నా వరకు ఇండస్ట్రీలో అతనే నెం 1 హీరో” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కోట కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేశాయి. అసలే RRR లో తారక్ ని తక్కువ చేసి చరణ్ ని హైలెట్ చేశారు అని మాటలు వినిపిస్తున్న తరుణంలో..కోట మాటలు సంచలనంగా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news