భారీ అంచనాలతో వచ్చిన ఆచార్య సినిమా అందరికీ షాక్ ఇచ్చింది. అసలు ఆచార్య పరాజయం ఎవ్వరూ ఊహించనే లేదు. ఇటు చిరంజీవి ఎంతో ఇష్టపడి కొరటాల శివతో సినిమా చేశాడు. కొరటాల శివ కూడా నాలుగు సూపర్ హిట్ సినిమాల తర్వాత చిరంజీవి బ్లాక్‌బస్టర్ హిట్ ఇవ్వాలని కసితో ఈ సినిమా చేశాడు. అయితే నాలుగేళ్ల పాటు ఈ సినిమా నిర్మాణంలో ఉండడంతో పాటు వడ్డీ రేట్లుభారీగా అవ్వడం.. బడ్జెట్ పెరిగిపోవడం..కథలో మార్పులు ఇవన్నీ ఈ సినిమాపై ప్రి రిలీజ్ బజ్ తగ్గడానికి కారణం అయ్యాయి.
కారణం ఏదేనా వరల్డ్ వైడ్‌గా రు. 130 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య వారం రోజులకే చాప చుట్టేసింది. ఈ సినిమాకు రు. 50 కోట్ల షేర్ కూడా రాలేదు. ఇంత క్రేజీ కాంబినేషన్లో వచ్చిన సినిమా అసలు ఊహించని విధంగా వారం రోజులకే థియేటర్ల నుంచి వెళ్లిపోతుందని ఎవ్వరూ ఊహించనే లేదు. ఈ సినిమా దెబ్బతో బయ్యర్లు, డిస్టిబ్యూటర్లకు తీవ్ర నష్టాలు వాటిల్లాయి.
చివరకు బయ్యర్లు కూడా చిరంజీవి స్వయంగా తమను ఆదుకోకపోతే తాము ఇక భవిష్యత్తులో వ్యాపారం చేసుకోలేమని కూడా ఆయనకే నేరుగా లేఖ రాశారు. దీంతో చిరంజీవి, రామ్‌చరణ్ తో పాటు దర్శకుడు కొరటాల సైతం తాము తీసుకున్న రెమ్యునరేషన్లో కొంత వెనక్కు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరు ఇప్పటికే రు. 10 కోట్లు వెనక్కు ఇచ్చాడు.
సినిమా రిలీజ్ రోజునే నిర్మాత రిలీజ్ చేసేందుకు ఇబ్బందులు పడుతుంటే అప్పుడే రు. 10 కోట్లు వెనక్కు ఇచ్చాడని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు కొరటాల కూడా తన వంతు వాటా వెనక్కు ఇచ్చినట్టు టాక్ ? ఈ సినిమా నిర్మాణంతో పాటు అమ్మకాల్లో కొరటాల అన్నీ తానై వ్యవహరించారు. దీంతో ఆయన తన వాటాగా పాతిక కోట్లు వెనక్కి ఇచ్చారని తెలిసింది.
ఒక దర్శకుడు పాతిక కోట్లు వెనక్కి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదనే టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక చెర్రీ ఇప్పటి వరకు ఈ సినిమాకు రెమ్యునరేషనే వెనక్కు తీసుకోలేదు. చెర్రీ కూడా త్వరలోనే తన వాటాగా ఎంతో కొంత డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వనున్నాడు. ఏదేమైనా ఆచార్య నష్టం అయితే మామూలుగా లేదు.