టాలీవుడ్ మేకర్స్‌కు మొన్నటి వరకకు పెద్ద ధైర్యం ఉండేది. గత రెండు, మూడేళ్లలో టాలీవుడ్ మార్కెట్ అంచనాలకు మించి మరీ పెరిగింది. డబ్బింగ్ రైట్స్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్… ఇతర ప్రాంతాల నుంచి మన తెలుగు సినిమాలకు మాంచి వసూళ్లు రావడంతో మన మేకర్లు భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసే విషయంలో ధైర్యంగా ఓ అడుగు ముందుకు వేసేవారు.
బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి మీడియం రేంజ్ హీరోలకు కూడా భారీగా ఖర్చు చేయడంతో పాటు స్టార్ హీరోయిన్లనే పెడుతున్నారు. శ్రీనివాస్ సినిమాలకు బాలీవుడ్ డబ్బింగ్, ఓటీటీ రైట్స్ ద్వారానే చాలా అమౌంట్ వస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్సే మన తెలుగు సినిమా రంగంలో చిన్న హీరోల సినిమాలను బతికిస్తుండడంతో పాటు మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసేందుకు వాళ్లకు ఓ ధైర్యంగా ఉంటూ వస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఆ నమ్మకాలు వమ్ము అవుతున్నాయి. ఓటీటీలు భారీ రేట్లకు తెలుగు సినిమా రైట్స్ సొంతం చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు ఓటీటీలు భారీగా ఖర్చు చేశాయి. ఇప్పుడు ఓటీటీల కోసం పెట్టే పెట్టుబడుల్లో దాదాపు 50 శాతం కట్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పెట్టిన పెట్టుబడితో లాభాలు ఆర్జించేందుకు రెడీ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, డిస్నీ లాంటి సంస్థలు తమ కంటెంట్ బడ్జెట్ బాగా తగ్గించుకున్నాయి.
నెట్ ఫ్లిక్స్ కూడా తమ కంటెంట్ బడ్జెట్‌ను ఏకంగా 50 శాతంకు కాస్త అటూ ఇటూగా కోత పెట్టేసుకుందట. అమోజాన్ ప్రైమ్ వీడియోస్ అయితే రీజనల్ కంటెంట్ విషయంలో ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఇది
చిన్న సినిమాలకు పెద్ద వరంగా మారింది. అయితే ఇప్పుడు ఈ సంస్థ పే పర్ వ్యూ ( వచ్చిన క్లిక్స్‌ను బట్టి ) రెవెన్యూ ఇచ్చే పద్ధతిలోకి దిగిపోయింది. అంటే కమీషన్ బేస్ మీద వ్యాపారం చేస్తుందన్నమాట. అలా అయితే నిర్మాతలకు గిట్టుబాటు అయ్యేదేం ఉండదు.
కాస్తో కూస్తో జీ 5, సోనీ లివ్ మాత్రమే రీజనల్ కంటెంట్ కొంటున్నా… అవి వెబ్‌సీరిస్, ఇతర కంటెంట్ వైపు మళ్లుతున్నాయి. ఇక ఆహా అయితే ఏ కంటెంట్ ఎంత చీప్‌గా దొరుకుతుందా ? అన్న ఆలోచనతోనే ఉంటుంది. ఇలా ఓటీటీలు బడ్జెట్ తగ్గించేసుకుని తెలుగు సినిమాల విషయంలో వెనకడుగు వేసినా… ఇతర ప్రత్యామ్నాయాల వైపు వెళ్లినా టాలీవుడ్‌కు పెద్ద షాకే అవుతుంది. అలాగే పెద్ద హీరోల సినిమాలకు నాన్ థియేట్రికల్ ద్వారా వచ్చే కోట్లాది రూపాయలకు గండి పడుతుంది.