MoviesAMB సినిమాస్‌లో స‌ర్కారు వారి పాట చూసిన బాల‌య్య‌... మామూలు ఎంజాయ్...

AMB సినిమాస్‌లో స‌ర్కారు వారి పాట చూసిన బాల‌య్య‌… మామూలు ఎంజాయ్ కాదుగా…!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట సినిమా నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. సినిమాకు కొంద‌రు కావాల‌ని మిక్స్ డ్ టాక్ తెచ్చినా కూడా ఫ‌స్ట్ డే కేవ‌లం ఏపీ, తెలంగాణ వ‌ర‌కే ఈ సినిమా రు. 50 కోట్ల గ్రాస్‌తో పాటు ఏకంగా రు. 36 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ వ‌సూళ్లే సినిమా రేంజ్ ఏంట‌న్న‌ది చెప్పేస్తున్నాయ్‌. గురువార‌మే సినిమా రిలీజ్ కావ‌డంతో ఏకంగా నాలుగు రోజుల వీకెండ్ వ‌చ్చింది.

శ‌ని, ఆదివారాల్లో ఇప్ప‌టికే భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్‌లు జ‌రిగాయి. ఈ లెక్క‌న చూస్తే ఫ‌స్ట్ వీకెండ్‌కే చాలా చోట్ల 80 శాతం వ‌సూల్లు రాబ‌డుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అటు ఓవ‌ర్సీస్‌లోనూ ఫ‌స్ట్ డే ఏకంగా 1.2 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. స‌ర్కారు వారి పాట‌కు నిన్న‌టి నుంచే సినీ సెల‌బ్రిటీల ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని .. మ‌హేష్ న‌ట‌న అదిరిపోయింద‌ని.. కీర్తితో రొమాంటిక్ ట్రాక్ సూప‌ర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ స‌ర్కారు వారి పాట సినిమాను నటసింహం నందమూరి బాలకృష్ణ స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా చూసినట్టు తెలుస్తుంది. మ‌హేష్‌బాబుకే చెందిన AMB సినిమాస్‌లో బాల‌య్య స్పెష‌ల్ స్క్రీనింగ్‌లో ఈ సినిమా చూశాడ‌ట‌. సినిమా చూస్తున్నంత సేపు బాల‌య్య బాగా ఎంజాయ్ చేశాడ‌ని అంటున్నారు. సినిమా అనంత‌రం బాల‌య్య ఉత్సాహంతో ఫీల్ అవ్వ‌డంతో ఆయ‌న‌కు బాగా న‌చ్చింద‌నే టాక్ ?

ఇటీవ‌ల బాల‌య్య త‌న అన్‌స్టాప‌బుల్ షో ద్వారా అంద‌రు హీరోల‌కు బాగా ద‌గ్గ‌రైపోతున్నాడు. మ‌హేష్‌బాబు కూడా ఈ టాక్ షోకు వ‌చ్చి చాలా విష‌యాలు షేర్ చేసుకున్నాడు. మ‌హేష్ – బాల‌య్య ఎపిసోడ్ కూడా అన్‌స్టాప‌బుల్ ఫ‌స్ట్ సీజ‌న్‌కే బాగా హైలెట్ అయ్యింది. ఇక నంద‌మూరి – ఘ‌ట్ట‌మ‌నేని వంశాల మ‌ధ్య బాండింగ్ ఈ నాటిది కాదు… ఏదేమైనా అన్‌స్టాప‌బుల్‌తో ఏర్ప‌డిన బాండింగ్ ఇప్పుడు బాల‌య్య స‌ర్కారు వారి పాట చూడ‌డంతో అలా మ‌రింత స్ట్రాంగ్‌గా కంటిన్యూ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news