దివంగత కన్నడ నటి సౌందర్యకు భాషతో సంబంధం లేకుండా భారత దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సౌందర్య అంటే రెండున్నర దశాబ్దాల క్రితం అప్పడు మరో సావిత్రి. సావిత్రి తర్వాత అంతటి గొప్ప నటిగా సౌందర్యకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆమెకు సొంత ఇండస్ట్రీ కన్నడంలో కంటే తెలుగులోనే ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తెలుగులో అందరి హీరోలతో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఘనత సౌందర్యదే. పది సంవత్సరాల పాటు ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. తెలుగులో చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో పాటు జగపతిబాబు, శ్రీకాంత్, రాజశేఖర్ లాంటి హీరోల పక్కన కూడా నటించి హిట్లు కొట్టింది. అప్పట్లో ఒక సినిమాలో సౌందర్య ఉందంటే ఆ సినిమాకు హీరోతో సంబంధం లేకుండా మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది.
సౌందర్య అటు తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు పలువురు స్టార్ హీరోలతో నటించి తమిళ ఇండస్ట్రీని కూడా ఏలేసింది. సినిమాలకు గుడ్‌బై చెప్పిన సౌందర్య తన సొంత మేనబావను పెళ్లాడి ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దురదృష్టవశాత్తు 2004లో అప్పుడు కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన బిజెపి అభ్యర్థి విద్యాసాగర్ రావు ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లో కరీంనగర్ వస్తూ హెలికాప్టర్ కూలిపోవడంతో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సౌందర్య తో పాటు సౌందర్య అన్న అమర్ కూడా మృతి చెందటం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఇదిలా ఉంటే సౌందర్య అన్న అమర్ కు ఓ స్టార్ హీరోయిన్‌తో పెళ్లి పెళ్లి జరగాల్సి వుంది అట. అయితే కొన్ని కారణాల వల్ల పెళ్లి జరగలేదు.
సౌందర్య హీరోయిన్ గా ఉన్నప్పుడే ఆమని కూడా సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగారు.
ఆమని కూడా కన్నడ కస్తూరి కావటం విశేషం. అప్పట్లో సౌందర్య ఎక్స్‌పోజింగ్ కు దూరంగా చాలా సాంప్రదాయబద్ధమైన పాత్రలు, వేషధారణతో ప్రేక్షకులను మెప్పించేది. ఆమని మాత్రం అప్పుడప్పుడు కాస్త గ్లామర్ డోస్ పెంచుతూ ఉండేది. చాలా సందర్భాల్లో అవుట్ డోర్ షూటింగ్‌లు జరుగుతున్నప్పుడు ఆమని షూటింగ్ అయిపోయాక సౌందర్య ఫ్యామిలీతో కలిసి ఉండేదట. సౌందర్యను ఎక్స్‌పోజింగ్ చేయవు అని అడిగితే రేపు పెళ్లయ్యాక నాకు ఒక మొగుడు వస్తాడు… నువ్వు ఎందుకు అలా చేశావు అని అడుగుతాడు… అలా ఎందుకు ? అడిగించు కోవాలని సౌందర్య చెప్పేదట.
అయితే ఆమని మాత్రం తనకు కథ, సీన్‌కు అనుగుణంగా ఎక్స్‌పోజింగ్ చేయాల్సి వస్తే ఆ విషయంలో రాజీపడే దానిని కాదని ఇంటర్వ్యూలో చెప్పారు. సౌందర్య తండ్రి ఒకసారి ఆమనితో మా అబ్బాయి అమర్‌ను పెళ్లి చేసుకోమని అడిగేసారట. పైగా ఆయన చాలా సాంప్రదాయబద్ధంగా ఉండేవారట. సౌందర్య తండ్రితో పాటు సౌందర్య ఫ్యామిలీ అంతా సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు విలువ ఇచ్చేవారట. ఆమని అంటే ఎంతో ఇష్టంతోనే ఆయన ఆ మాట అడిగేశారట.
షాక్ అయిన ఆమని సార్ నేను ఒక ఆర్టిస్టు అని చెప్పినా… మా అమ్మాయి హీరోయిన్… నువ్వు హీరోయిన్ కదా..! ఇద్దరూ వదిన మరదలు అయితే బాగుంటుంది అని… అమర్‌కు నువ్వు సరి జోడీ అవుతావు అని అన్నారట. ఈ సంఘటన జరిగినప్పుడు పక్కనే తెలంగాణ శకుంతల కూడా ఉన్నారని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. తెలంగాణ శకుంతల కూడా నిన్ను నిజంగానే వాళ్లు కోడలిని చేసుకోవాలని ఇష్టపడుతున్నారని కూడా అన్నారట. అయితే ఆ తర్వాత అమర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు ఆమని చెప్పింది. అయితే దురదృష్టవశాత్తు సౌందర్యతో పాటే హెలికాప్టర్ ప్రమాదంలో అమర్ కూడా మృతి చెందాడు. సౌందర్య భర్త మరో పెళ్లి చేసుకున్నాడు.