బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ కొట్టడం.. ఇటు కెరీర్లోనే బాలయ్య ఏ సినిమాకు రాని వసూళ్లు అఖండకు రావడంతో బాలయ్యకు సరైన కథ పడితో ఏ రేంజ్లో ఉంటుందో స్టార్ దర్శకులకు కూడా తెలుస్తోంది. పైగా అన్‌స్టాపబుల్ షోతో బాలయ్య ఈ తరం జనరేషన్‌కు కూడా బాగా కనెక్ట్ అయిపోయాడు. బాలయ్య క్రేజ్ అఖండ తర్వాత ఎలా పెరిగిందో సోషల్ మీడియాలో బాలయ్య పోస్టులు వైరల్ అవుతుండడమే చెపుతోంది. బాలయ్యకు ఇటీవల కాలంలోనే న్యూట్రల్ అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు.
ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు బాలయ్య మలినేని గోపీచంద్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఆ వెంటనే సెప్టెంబర్ నుంచి అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ విషయాన్ని అనిల్ తాజాగా ప్రకటించారు. అనిల్ స్టైల్ కామెడీతో పాటు బాలయ్య మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండబోతోందట. కారణాలు ఏవైనా ఇప్పుడు బాలయ్య ఉన్న ఫామ్‌ను చూసి కావచ్చు.. రాజకీయ సమీకరణలు, భవిష్యత్తు ప్లానింగ్ నేపథ్యంలో చాలా మంది స్టార్ దర్శకులు సైతం బాలయ్యతో సినిమా చేసేందుకు తహతహలాడుతున్నారు.
ఎవరెన్ని ఔనన్నా.. కాదన్నా బాలయ్య మనస్సులో బోయపాటికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు మూడు సూపర్ హిట్లు ఇచ్చాడు బోయపాటి. ఈ మూడు హిట్లు బాలయ్య గ్రాఫ్‌ను ఆయన కెరీర్ పరంగా ఎక్కడికో తీసుకువెళ్లాయి. పైగా మరోసారి బోయపాటి బాలయ్యతో సినిమాకు రెడీ అయిపోతున్నాడు. ఈ లోగానే కొందరు దర్శకులు ఖర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ లిస్టులోనే టాప్ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నాడు.
ఆచార్య తర్వాత కొరటాల ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత బన్నీ లైన్లో ఉన్నా కూడా ఎందుకో ముందు బాలయ్య సినిమాయే చేయాలని ఆయన పట్టుదలతో ఉన్నాడని ఒక్కటే చర్చ నడుస్తోంది. బోయపాటి – కొరటాల పోసాని లింక్ ద్వారా బంధువులే. వీరి మధ్య ఏదో గ్యాప్ ఉంది. ఇప్పుడు కొరటాల కూడా బాలయ్యతో సినిమా చేసి సూపర్ హిట్ కొట్టి నందమూరి, బాలయ్య అభిమానుల్లో ఓ స్పెషల్ ప్లేస్ సంపాదించుకోవాలనే తాపత్రయంతో ఉన్నాడట.
కొన్ని ఇంటర్వ్యూల్లోనూ కొరటాల బాలయ్యతో సినిమా ప్రస్తావన తీసుకువచ్చారు. తాజాగా ఇండస్ట్రీలో ఓ ప్రముఖ బ్యానర్ నిర్మాతలతో ఎలాగైనా బాలయ్యతో ముందుగా సినిమా చేసి బ్లాక్‌బస్టర్ కొట్టాలని కసితో అన్నారట. బాలయ్య ఓకే చెప్పాలే కాని.. ఆయన కోసం అదిరిపోయే కథ రెడీగా ఉందని.. నాలుగేళ్ల క్రితమే ఈ కథ తాను రెడీ చేసుకున్నానని కూడా కొరటాల అన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా బాలయ్యకు తాను కూడా ఆయన గత సినిమాలకు మించిన బ్లాక్‌బస్టర్ ఇవ్వాలన్న తాపత్రయం అయితే కొరటాల మాటల్లో కనిపిస్తోంది. మరీ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో ? చూడాలి.