అతిలోక సుందరి శ్రీదేవి రెండున్నర దశాబ్దాల క్రిందట ఆమె ఇండియన్ సినిమా ప్రేక్షకుల కలల రాణి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు శ్రీదేవి వెండితెరను ఏలేసింది. శ్రీదేవి స్వతహాగా తమిళియన్ అయినా ఆమెకు తెలుగులోనే తిరుగులేని క్రేజ్ వచ్చింది. నాటి తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణతో మొదలు పెడితే ఆ తర్వాత తరంలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వరకు అందరితోనూ శ్రీదేవి కలిసి నటించింది.
విచిత్రం ఏంటంటే అటు తండ్రి ఏఎన్నార్‌తోనూ, ఇటు కొడుకు నాగార్జునతోనూ శ్రీదేవి నటించినా ఇద్దరి పక్కన ఆమె పర్‌ఫెక్ట్ జోడీ అనిపించుకుంది. ఇలాంటి అరుదైన ఘనత ఒక్క శ్రీదేవికే సొంతం. అసలు శ్రీదేవి పక్కన ఒక్క సినిమా చేసినా జీవితం ధన్య అయినట్టే అనుకునే హీరోలతో పాటు దర్శకులు ఎంతో మంది ఉన్నారు. సౌత్ సినిమాను ఆమె ఏలేస్తోన్న టైంలో శ్రీదేవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక ఆమె నేషనల్ వైడ్‌గా కోట్లాది మంది సినీ అభిమానుల ఆరాధ్య దేవత అయిపోయింది. ఆ తర్వాత ఆమె వెను దిరిగి చూసుకోలేదు. అయితే ఆ సమయంలోనే బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటికే బోనీకపూర్‌కు పెళ్లయ్యి.. పిల్లలు ఉన్నా కూడా బోనీ మాయలో శ్రీదేవి పడిపోయింది. అయితే శ్రీదేవి మరణం పెద్ద విషాదకరం. అంత క్రేజ్ ఉన్న హీరోయిన్.. కెరీర్ అలా ముగుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
శ్రీదేవి జుదాయి సినిమా షూటింగ్‌లో ఉన్న టైంలో శ్రీదేవి తల్లి రాజేశ్వరి అనారోగ్యంతో మృతి చెందారు. ఇలా చినపోయినప్పుడు కొడుకులు మాత్రమే తల కొరివి పెడుతూ ఉంటారు. అయితే శ్రీదేవి సవతి సోదరులు ఉన్నా.. వారు రాజేశ్వరికి తలకొరివి పెట్టేందుకు ముందుకు రాలేదు. అయితే శ్రీదేవి తప్పనిసరి పరిస్థితుల్లో సమాజంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. కొందరితో మాటలు పడినా ధైర్యంగా ముందుకు వచ్చి మరీ తలకొరివి పెట్టింది.
అప్పట్లో శ్రీదేవి ఇలా చేయడం ఓ సంచలనంగా మారింది. ఇక శ్రీదేవి – బోనీ కపూర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం జాన్వీకపూర్ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలు ఒకరిగా దూసుకుపోతున్నారు. ఆమె తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నా.. సరైన కాంబినేషన్ సెట్ కాలేదు.