సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్ల మధ్య ఈగోలో కామన్. ఇది ఈ నాటిది కాదు. 1980వ దశకం నుంచే ఉన్నాయి. అప్పట్లో జమున డామినేషన్ వల్ల స్టార్ హీరోలు హర్ట్ అయ్యేవారని అంటారు. అందుకే అప్పటి స్టార్ హీరోలు జమునకు ఛాన్సులు ఇవ్వకూడదని ఓ కండీషన్ కూడా పెట్టుకున్నారని అంటారు. అంతకు ముందు సైతం సావిత్రి, భానుమతి లాంటి క్రేజీ హీరోయిన్లు.. ఆ తర్వాత వాణిశ్రీ లాంటి హీరోయిన్లు కూడా ఒక్కోసారి హీరోలను డామినేట్ చేసేవారన్న టాక్ ఉంది.
ఆ తర్వాత కూడా చిరంజీవి – విజయశాంతి మధ్య ఇదే తరహాలో కోల్డ్‌వార్ నడిచేదని అంటారు. ఇక ఇప్పటి తరంలో కూడా కొందరు హీరోలకు, హీరోయిన్లకు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం మనకు తెలిసిందే. నేచురల్ స్టార్ నానికి, సాయిపల్లవికి మధ్య ఎంసీయే సినిమా షూటింగ్‌లో పెద్ద కోల్డ్‌వారే నడిచిందన్న టాక్ బయటకు వచ్చింది. చివరకు దర్శకుడితో పాటు నిర్మాత దిల్ రాజు కూర్చొని ఈ గ్యాప్ సరిచేశారట.
అలాగే యాంగ్రీ మంగ్‌మ్యాన్ డాక్టర్ రాజశేఖర్‌కు – హీరోయిన్ కమలినీ ముఖర్జీకి మధ్య ఓ సినిమా షూటింగ్‌లో ఇలాంటి వివాదమే నడిచిందట. చివరకు రాజశేఖర్‌పై కోపంతో కమలిని షూటింగ్‌కు కూడా రాలేదట. స్విట్జర్లాండ్‌లో ఈ సంఘటన జరిగిందట. ఈ విషయాన్ని నిర్మాత నట్టికుమార్ స్వయంగా చెప్పారు. రాజశేఖర్ – కమలిని జంటగా నట్టి కుమార్ నిర్మాతగా ఓ సినిమా తీశారు. స్విట్జర్లాండ్‌లో షూటింగ్ జరుగుతుండగా అటు రాజశేఖర్ ఫ్యామిలీతో పాటు.. ఇటు నట్టి కుమార్ ఫ్యామిలీ కూడా అక్కడే ఉందట.
మొత్తం 35 రోజుల పాటు షూటింగ్ చేశారు. అయితే సినిమా షూటింగ్ మరో గంట మాత్రమే ఉంది అనుకున్న సమయంలో రాజశేఖర్‌తో ఏదో వివాదం రావడంతో కమలినీ షూటింగ్‌కు రాకుండా… నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయి ఇండియాకు వచ్చేసిందట. అసలు కమిలినీ ఎందుకు అలిగి వచ్చేసిందో కూడా నట్టికుమార్‌కే కాదు.. ఎవ్వరికి అర్థం కావడం లేదట.
ఆ తర్వాత రాజశేఖర్‌తో చిన్న గొడవ వల్లే కమలినీ అలిగి ఇండియా వచ్చేసిందని తెలిసింది అట. ఆ వివాదం ఎందుకు చెలరేగిందో ఇప్పటకీ తనకు తెలియదని.. అయితే నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈ గొడవను సెటిల్ చేశారని నట్టి కుమార్ చెప్పారు.