Moviesఎన్టీఆర్ త‌ల్లి షాలినిపై కేజీయ‌ఫ్ య‌శ్ కామెంట్స్ వైర‌ల్‌..!

ఎన్టీఆర్ త‌ల్లి షాలినిపై కేజీయ‌ఫ్ య‌శ్ కామెంట్స్ వైర‌ల్‌..!

మ‌రి కొద్ది గంట‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ న‌టించిన కేజీయ‌ఫ్ 2 సినిమా స్క్రీన్ అవుతోంది. మూడేళ్ల క్రితం ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన కేజీయ‌ఫ్ సినిమా ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో న‌టించిన వాళ్ల‌తో పాటు టెక్నీషియ‌న్లు అంద‌రూ ఓవ‌ర్ నైట్ స్టార్లు అయిపోయారు. ఇక ఇప్పుడు కేజీయ‌ఫ్ 2 వ‌స్తోంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్లు సౌత్ టు నార్త్ వ‌ర‌కు హోరెత్తిపోతున్నాయి. తెలుగులో కూడా ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. క‌న్న‌డంలో ఈ సినిమాకు రు. 100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇటు తెలుగులోనూ రు. 80 కోట్ల‌కు పైగానే ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌డంతో పాటు తెలంగాణ‌లో టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిందంటేనే సినిమాపై అంచ‌నాలు ఎలా ? ఉన్నాయో తెలుస్తోంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో య‌శ్ ఎన్టీఆర్‌తో పాటు త్రిబుల్ ఆర్ సినిమా, ఎన్టీఆర్ త‌ల్లి షాలినిపై చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమాను థియేట‌ర్ స్క్రీన్ మీద చూసిన‌ప్పుడు తాను చాలా ఎగ్జైట్ అయ్యాన‌ని.. ఎన్టీఆర్ ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చిన విష‌యం తాను ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేన‌ని య‌శ్ అన్నాడు. ఎన్టీఆర్ త‌ల్లి క‌ర్నాక‌ట‌కు చెందిన వారు కావ‌డంతో ఆమె నాపై ఎంతో ఆప్యాయ‌త‌, ప్రేమ చూపించేవార‌ని య‌శ్ తెలిపారు.

ఇక హైద‌రాబాద్‌లో ఎక్క‌డ షూటింగ్ జ‌రిగినా కూడా రామ్‌చ‌ర‌ణ్ త‌న‌కు భోజ‌నం పంపేవార‌న్న య‌శ్‌… ప్ర‌శాంత్ నీల్ వ‌ల్లే తామంతా ఇక్క‌డ ఉన్నామ‌ని.. రాజ‌మౌళి, శోభు గారు ఇచ్చిన స‌ల‌హాల వ‌ల్ల కేజీయ‌ఫ్ 2 ఈ స్థాయిలో వ‌చ్చింద‌న్నాడు. ఏదేమైనా య‌శ్ ఎన్టీఆర్‌, ఎన్టీఆర్ త‌ల్లి చూపించిన ప్రేమ‌, ఆప్యాయ‌త గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు తార‌క్ ఫ్యాన్స్ బాగా వైర‌ల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news