టాలీవుడ్లో అతడో యాంకర్. అసలే మన తెలుగు సినిమాలు, బుల్లితెరను మహిళా యాంకర్లు తెగ ఏలేస్తున్నారు. ఏ ప్రోగ్రామ్‌లో చూసినా ఈ మహిళా మణులదే హవా. అలాంటి సామ్రాజ్యంలో ఈ బుల్లితెర ఫీమేల్ యాంకర్ బాగా దూసుకుపోయాడు. ఇతడి యాంకర్ అంటే పడిచచ్చే బుల్లితెర మహిళా అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఈ యాంకరింగ్ సామ్రాజ్యంలో అతగాడిపై చాలా గాసిప్‌లే వినిపించాయి.
గతంలో ఓ పెద్దింటి అమ్మాయితో మాంచి సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడు. హైదరాబాద్‌లో మాత్రమే కాదు.. ఎక్కడ చూసినా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ అమ్మాయితో కలిసి మనోడిని గోవాలో చూసిన వాళ్లు ఆ పెద్దింటి ఫ్యామిలీకి హింట్ ఇచ్చారు. దీంతో ఆ బంధానికి అక్కడితో బ్రేకప్ పడిపోయింది. ఆ తర్వాత కూడా అతడిపై కొన్ని గాసిప్‌లే వచ్చాయి. ప్రస్తుతం అంతా ప్రశాంతమే అనుకుంటోన్న టైంలో మనోడు మరో బ్రేకింగ్ ఎఫైర్‌తో వార్తల్లోకి వచ్చేశాడు.
మరో కొత్త అమ్మాయితో సహజీవనం మొదలు పెట్టేశాడట. వీరిద్దరు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో పాటు ఓ ప్లాట్‌లో సీక్రెట్‌గా సహజీవనం కూడా చేస్తున్నారట. అయితే ఈ కొత్త అమ్మాయి ఎవరు ? అన్నది తెలియదు కాని.. ఆమెకు ఇప్పటికే పెళ్లయ్యి విడాకులు కూడా మంజూరు అయ్యాయని టాక్ ?
అయితే సదరు యాంకర్ ఈ కొత్త సహజీవనం అనేది.. ఈ సారి కూడా అక్కడితో ఆగిపోతుందా ? పెళ్లి వరకు వెళుతుందా ? అన్నది చూడాలి. అతడి వయస్సు కూడా ఎక్కువే. ఆల్రెడీ ముదురు బెండకాయ అన్న టాక్ ఉంది. మరి ఈ ముదురు బెండకాయ మరింత ముదురుతాడో ? ఇప్పటకి అయినా పెళ్లితో సెటిల్ అవుతాడో ? చూడాలి.