సితార ఒకనాటి అందాల తార. ఈ సితార గురించి తెలుగు సినిమా జనాలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అచ్చ తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఆమె ఎన్నో సినిమాలు చేసింది. ఆమెకు అప్పట్లో ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. సినిమాలకు దూరమైన ఆమె లాంగ్ గ్యాప్ తీసుకుని.. తర్వాత సినిమాల్లో అక్క, వదిన, అమ్మ పాత్రలతో మళ్లీ ప్రేక్షకులకు దగ్గరైంది. సితార సీరియల్స్‌లో కూడా నటించి ఇటు బుల్లితెర అభిమానులకు కూడా దగ్గరైంది.
సితార 1990లో వచ్చిన మనసు మమత సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఆమె తెలుగులో ఎన్నో మంచి సినిమాలు చేసింది. జీవన చదరంగం -గంగ – శ్రీవారి చిందులు – శుక్రవారం మహాలక్ష్మి – మా వారికి పెళ్ళి – అక్క చెల్లెళ్ళు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సితార ఓ మళయాలి అమ్మాయి అంటే అసలు తెలుగు ప్రేక్షకులు ఎవ్వరూ నమ్మేవారు కాదు… అంతలా తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైపోయింది.
సితార సొంత ఊరు కేరళ రాష్ట్రంలోని కిలిమనూరు. ఇక సితార వయస్సు 46 ఏళ్లు. ఆమె ఇంత వయస్సు వచ్చినా ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. సితార చూడడానికి బోల్డెంత అందం.. అభినయంలోనూ ఆమెకు తిరుగులేదు. మరి ఆమె ఎందుకు ? పెళ్లి చేసుకోలేదన్నది చాలా రోజుల వరకు ఎవ్వరికి అర్థం కాలేదు. దీనిపై ఆమె ఓ ఇంటర్వ్యూలోనే ఓపెన్‌గా చెప్పేసింది. మా నాన్న గారంటే తనకు చాలా ఇష్టం అని.. అన్ని విషయాల్లోనూ తాను ఆయన సలహాలు మాత్రమే తీసుకుంటాను.. ప్రతి విషయంలోనూ ఆయన తనను ఎంతో సపోర్ట్ చేస్తారని చెప్పింది.
అలాంటి నాన్న గారు సడెన్‌గా మృతి చెందడంతో తాను ఎంతో డిఫ్రెషన్‌కు గురయ్యానని.. కొన్నాళ్ల పాటు తాను సినిమాలకు దూరంగా ఉన్నానని చెప్పింది. అలా కొద్ది రోజులు గడచిపోయాయని.. తర్వాత ఆ బాధ మరచిపోవడానికి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయానని… దీంతో ఏజ్ గడుస్తూ వచ్చింది.. నా మనస్సులో పెళ్లి అన్నది లేకుండా పోయిందని చెప్పింది. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా ? అని ప్రశ్నిస్తే.. ప్రస్తుతానికి తనకు ఆ ఆలోచనే లేదని.. ఒక వేళ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే.. తాను తప్పకుండా అందరికి చెప్పే పెళ్లి చేసుకుంటానని సితార చెప్పింది.