Movies' స్విటీ అనుష్క ' అన్నదమ్ముల గురుంచి మీకు తెలియని విష‌యాలివే...!

‘ స్విటీ అనుష్క ‘ అన్నదమ్ముల గురుంచి మీకు తెలియని విష‌యాలివే…!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభిమానుల అందాల బొమ్మ అరుంధతి. అనుష్క‌ అంటే ఇష్టపడని తెలుగు వారు ఉండ‌రు. సూపర్ చిత్రంతో అందాలు అరోబోస్తూ హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ అనుష్క శెట్టి టాలీవుడ్‌ను శాసించే స్థాయికి ఎదిగింది. నిన్న మొన్నటి వరకు అనుష్క డేట్స్ కోసం అగ్ర హీరోలు, బడా బడా దర్శకులు వెయిట్ చేశారు. మొదటి సినిమాతోనే తన టాలెంట్‌ను కనబరిచి అభిమానుల్ని పెంచుకుని వరుస అవకాశాలు అందుకుంది ఈ నటి. ఒక వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే అరుంధతి, బాహుబలి వంటి చారిత్రాత్మక చిత్రాల్లో నటించి మెప్పించింది.

అంతే కాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోను బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన ఘనత అనుష్కకు దక్కింది. యోగ మాస్టర్ గా కెరియర్ ఆరంభించిన ఈ హీరోయిన్ కామన్ ఫ్రెండ్ ద్వారా పూరి జగన్నాథ్ సూపర్ లో ఛాన్స్ అందుకొని ఆ తరవాత టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకు ఫస్ట్ ఆప్షన్ గా నిలిచింది. హీరోలతో సమాన స్టార్‌డం సొంతం చేసుకుంది ఈ కుంతల దేశపు యువరాణి. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఈ అందాల తార వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియదు.

 

అనుష్క సొంతూరు కర్ణాటక లోని మంగళూరు. ఈమె కన్నడ నుండి వచ్చిన నటి. ఈమె విఠల్ శెట్టి, ప్రఫుల్ల శెట్టి దంపతులకు జన్మించారు. వీరిది తులుకి చెందిన ఫ్యామిలీ. అనుష్కకు ఇద్దరు సోదరులు ఉన్నారు. పెద్దన్నయ్య గునరంజన్ శెట్టి, చిన్న అన్నయ్య సాయి రమేష్ శెట్టి. సాయి రమేష్ శెట్టికి సలోని రాయ్ అనే చార్టెడ్ అకౌంట్ తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మరో అన్నయ్య గున రంజన్ మాత్రం చెల్లెలు అనుష్క పెళ్లి జరిగితే కానీ పెళ్లి చేసుకోనని చెప్పేశారు. దాంతో ఇంకా అతడు కూడా బ్రహ్మచారిగానే ఉన్నాడు.

ఇద్దరు అన్నయ్యల‌ ముద్దుల చెల్లెలు స్వీటీ అంటే ఆ కుటుంబంలో ఎనలేని ప్రేమ. ప్రస్తుతం అనుష్క ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. నాలుగు పదుల వయస్సు క్రాస్ చేస్తున్నా ఇప్పటికీ సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు స్వీటీ. ఇక ఈమె ప్రేమ…వ్యవహారం అంటే ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్ద‌రి ప్రేమ‌, పెళ్లి అంటూ ఒక్క‌టే వార్త‌లు వ‌స్తూ ఉంటాయి.

ఈ వార్త‌ల‌పై అటు ప్ర‌భాస్‌, ఇటు అనుష్క ఎవ్వ‌రూ స్పందించ‌రు. పోనీ ఈ ఇద్ద‌రిలో ఒక‌రి పెళ్లి అయిపోయినా ఈ పుకార్ల‌కు చెక్ ప‌డుతుంది. అయితే ఇద్ద‌రూ పెళ్లి గిల్లీ లేకుండా సింగిల్‌గానే ఉంటున్నారు. అందుకే వీరిపై వార్త‌లు ఆగ‌డం లేదు. ఇక అనుష్క నిశ్శ‌బ్దం సినిమా త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మైత్రీ బ్యాన‌ర్లో న‌వీన్ పోలిశెట్టితో సినిమా చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news