ది గ్రేట్ సూపర్ స్టార్ కృష్ణకు స్వయానా కూతురు కొడుకు.. అటు మరో సూపర్ స్టార్ మహేష్‌బాబుకు మేనళ్లుడు.. ఇటు తండ్రి కుటుంబం నుంచి చూస్తే పెద్ద పారిశ్రామిక వేత్తల కుటుంబానికి చెందిన వారసుడు.. మనవడు.. తాత రాజ్‌గోపాల్ నాయుడు రాజ్యసభ సభ్యుడు.. కాకలుతీరిన రాజకీయ యోధుడు.. మామ్మ మాజీ మంత్రి.. నాన్న రెండు సార్లు ఎంపీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్రే ఉంది. అలాంటి ఫ్యామిలీ నుంచి ఓ హీరో సినిమాల్లోకి వస్తున్నాడు అంటే ఆ సినిమా ఎలా ఉండాలి.. అదిరిపోవాలి అంతే..! కానీ మహేష్‌బాబు మేనళ్లుడు గల్లా అశోక్ నటించిన డెబ్యూ మూవీ హీరో పెద్ద డిజాస్టర్ అయ్యింది.
నిజానికి ఈ సినిమాకు వాళ్లు కోట్లు ధారపోశారు. పైగా నిధి అగర్వాల్ లాంటి క్రేజీ హీరోయిన్‌ను తీసుకువచ్చి ఆమెకే కోటిన్నర ఇచ్చారు. కానీ వీళ్లు ఓ వీక్ డైరెక్టర్‌ను పెట్టుకున్నారు. ఆ వీక్ డైరెక్టర్ అంతకు మించి వీక్ సినిమా తీశాడు. నిజంగా వీళ్లు తమ కుమారుడికి మంచి సినిమాయే ఇవ్వాలని అనుకుంటే బెల్లంకొండ శ్రీనును ఉదాహరణగా తీసుకుని ఉండాల్సింది. అల్లుడు శీనుకు రు. 30 కోట్లు పెట్టారు. సమంత హీరోయిన్… ప్రకాష్‌రాజ్‌తో పాటు పెద్ద తారాగణం ఉంది. వినాయక్ డైరెక్టర్.
సినిమాకు బడ్జెట్ ఓవర్ అయినా.. కమర్షియల్‌గా సక్సెస్ అయ్యింది. కొన్ని చోట్ల లాభాలు లేకపోయినా బెల్లంకొండ వారసుడికి గ్రాండ్ ఎంట్రీ దక్కింది. తర్వాత బోయపాటితో తీసిన జయజానకీ నాయక కూడా హిట్ బొమ్మే.. అందరికి మంచి పేరు తీసుకువచ్చింది. సోలోగా వచ్చి ఉంటే ఆ సినిమాకు మంచి వసూళ్లు వచ్చి ఉండేవి. కానీ ఇంతకన్నా గొప్ప చరిత్ర ఉన్న గల్లా ఫ్యామిలీ కోట్లాది రూపాయలు తీసుకువచ్చి చేజేతులా నీళ్లలో పోసుకున్నట్టే అయ్యింది.
ఇక థియేటర్లలో ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. సంక్రాంతికి నాగార్జున నటించిన బంగార్రాజు లాంటి పెద్ద సినిమాతో పాటు దిల్ రాజు వారసుడి సినిమాతో పోటీ పడింది. చాలా ఘోరమైన వసూళ్లతో డిజాస్టర్ అనిపించుకుంది. వెండితెరపై ప్లాప్ అయిన హీరో తాజాగా బుల్లితెరపై ప్రీమియర్‌గా వచ్చేసింది. నాగార్జున బంగార్రాజుకు14 టీఆర్పీ వచ్చింది. ఇదో పెద్దగొప్ప టీఆర్పీ అని చెప్పుకోలేకపోయినా నాగార్జునకు ఇటీవల ఈ మాత్రం టీఆర్పీ కూడా లేదు.
ఆఫీసర్, మన్మధుడు 2 లాంటి సినిమాలు బుల్లితెర మీద కూడా ఫెయిల్ అయ్యాయి. వీటితో పోలిస్తే బంగార్రాజు బ్లాక్‌బస్టర్ కొట్టినట్టే..! ఇక సంక్రాంతికి బంగార్రాజుతో పోటీగా రిలీజ్ అయిన హీరో అయితే స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యి కేవలం 2 టీఆర్పీ రేటు దక్కించుకుంది. ఇది నిజంగా అటు గల్లా ఫ్యామిలీతో పాటు ఇటు ఘట్టమనేని ఫ్యామిలీకి ఘోరమైన అవమానం అనే చెప్పాలి. ఇక నూటొక్క జిల్లాల అందగాడు సినిమాను ఈటీవీలో ప్రసారం చేస్తే మరీ దారుణంగా 1 టీఆర్పీ వచ్చింది.