“ఆచార్య”..మెగాస్టార్ చిరంజీవి హీరోగా..ఆయన కొడుకు తో కలిసి నటించిన సినిమా. ఇద్దరు మెగా గీరోలు అందులోను నానా కొడుకులు..కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్..సినిమా ఎలా ఉండాలి. బొమ్మ పడగానే సౌండ్ మొత మొగాల్సిందే. ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలైంది. రామ్ చరణ్ మరియు మెగాస్టార్ లను చిరంజీవిలను వెండితెరపై చూడడానికి మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో మనకు తెలిసిందే. పైగా అపజయం ఎరుగని కొరటాల డైరెక్టర్ దర్శకత్వం వహించడంలో సినిమా పై డబుల్ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేశారు అభిమానులు.
కానీ, ఆ మార్క్ ను అందుకోలేకపోయాడు కొరటాల. సినిమా దారుణమైన టాక్ ను సొంతం చేసుకుంది. కొందరు అయితే కొరటాల ను తిట్టిపోస్తున్నారు. మెగా హీరోలతో ఎలాంటి సినిమా తీయ్యాలో తెలియదా నీకు అంటూ మండిపడుతున్నారు. ముఖ్యం గా సినిమా లో కధ లేకపోవడం పెద్ద మైనస్ గా మారిపోయింది. ఈ స్టైల్ కొరటాల నుండి ఎక్స్ పెక్ట్ చేయలేదు. అసలు కొరటాల రాసుకున్న కధ వేరేనట. మధ్యలో కావాలనే చరణ్ పాత్ర ను ఇరికించి..స్టోరీ మొత్తం నాశనం చేసున్నాడు అంటున్నారు జనాలు.
కాగా, ఈ సినిమా హీరోయిన్స్ విషయంలో ను పెద్ద గందరగోలం నే జరిగింది. మొదట చిరు కి జోడీగా కాజల్ ని అనుకున్న కొరటాల కొన్ని షాట్స్ అయిన తరువాత..ఆమె ను సినిమాను నుండి తప్పించేశారు. ఫైఅనల్ వరకు ఒక్క మాట కూడా చెప్పకుండా..తీరా ప్రీ రిలీజ్ లో జరిగిన రచ్చ కారణంగా కాజల్ ఓఉట్ అంటూ ప్రకటించేశాడు. అది మొదటి తప్పు అయితే..చరణ్ కి ముందు అనుకున్న హీరోయిన్ కీర్త్ సురేష్ అంటూ ఓ న్యూస్ లీకైంది. నిజానికి నీలాంబరి రోల్ కి కీర్తి అయితే చాలా బాగుండేది.
కానీ, ఆమె డేట్స్ కుదరకపోవడంతో..ఫైనల్ గా పూజాను పెట్టుకున్నారు. కొరటాల కొన్ని రోజులు ఆగిన్ కీర్తి ని పెట్టుకున్న సినిమాకి అంతో ఇంతో ప్లస్ అయ్యుండేది అంటున్నారు సినీ ప్రముఖులు. ఏది ఏమైనా తెలిసి ఒక తప్పు ..తెలియకుండా మరో తప్పు చేసి..కెరీర్ లో ఫస్ట్ ఫ్లాప్ అందుకున్నాడు కొరటాల శివ. మరి నెక్స్ట్ సినిమా కైనా జాగ్రత్తలు తీసుకుంటాడో లేదో చూడాలి..?