Moviesఅఖండ VS ఆచార్య‌... బాల‌య్య ఎందుకు హిట్‌.. చిరు ఎందుకు ఫ‌ట్‌...!

అఖండ VS ఆచార్య‌… బాల‌య్య ఎందుకు హిట్‌.. చిరు ఎందుకు ఫ‌ట్‌…!

ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోలు నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవి ఇద్ద‌రు నాలుగు ద‌శాబ్దాలుగా స్టార్ హీరోలుగా కొన‌సాగుతున్నారు. వీరిద్ద‌రు కూడా 2017లో త‌మ కెరీర్‌లోనే ప్రెస్టేజియ‌స్ ప్రాజెక్టుల‌తో ముందుకు వ‌చ్చారు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. రెండు సినిమాలు కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి. అయితే క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత ఈ ఇద్ద‌రు అగ్ర హీరోలు న‌టించిన సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి.

అస‌లు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయాలా ? వ‌ద్దా ? అన్న సందేహంలో ఉన్న‌ప్పుడు బాల‌య్య డేర్ చేసి త‌న అఖండ సినిమాను రిలీజ్ చేయించాడు. పైగా అప్పుడు ఏపీలో టిక్కెట్ రేట్లు చాలా త‌క్కువుగా ఉన్నాయి. అయితే అఖండ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అఖండ గర్జ‌న మోగించింది. ఏకంగా థియేట‌ర్ల‌లోనే రు. 150 కోట్లు కొల్ల‌గొట్టి.. మొత్తంగా రు. 200 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. అఖండ క‌థ క‌న్నా కూడా బాల‌య్య న‌ట‌న హైలెట్ అయ్యింది.

ఇక సైరా త‌ర్వాత మూడేళ్ల లాంగ్ గ్యాప్‌తో చిరంజీవి ఆచార్య థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. పైగా ఈ సినిమాలో చిరుతో పాటు ఆయ‌న త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ సైతం న‌టించాడు. అలాగే అస‌లు అప‌జ‌యం అన్న‌దే లేని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ సినిమా డైరెక్ట‌ర్‌. అయితే ఈ సినిమా నిన్న భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయ్యి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఆచార్య బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌డం క‌ష్ట‌మే అంటున్నారు.

ఇద్ద‌రు పెద్ద హీరోల సినిమాలు.. రెండు కూడా అ టైటిల్స్‌తోనే స్టార్ట్ అయ్యాయి. అచార్య‌, అఖండ‌. పైగా బాల‌య్య సినిమా కంటే చిరు సినిమాకే కాస్త స్టార్ట్ కాస్టింగ్ ఉంది. అఖండ‌కు ముందు బోయ‌పాటికి ప్లాప్ ఉంది. ఆచార్య‌కు ముందు కొర‌టాల‌కు నాలుగు వ‌రుస హిట్లు ఉన్నాయి. కానీ తేడా ఎక్క‌డ కొట్టింది.. అఖండ‌తో పోలిస్తే ఆచార్య ఎందుకు ? తేలిపోయింద‌న్న‌ది చూస్తే చాలా విశ్లేష‌ణ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

రెండు సినిమాల మ‌ధ్య కంపేరిజ‌న్ చూస్తే అఖండ ఊర మాస్ బొమ్మ‌… ఊర‌మాస్ క‌థ‌కు ఊర‌మాస్ బాల‌య్య న‌ట‌న తోడు అయ్యింది. ఆచార్య అటూ క్లాస్ కాదు ఇటు మాస్ కాదు అన్న‌ట్టుగా ఉంది. అఖండ సినిమాలో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఎలివేష‌న్ అదిరిపోయే రేంజ్‌లో ఉంది.. అస‌లు ప‌తాక స్థాయిలో బాల‌య్య‌ను చూపించాడు. ఆచార్య విష‌యానికి వ‌స్తే … అస‌లు కొర‌టాల‌కు మామూలుగానే ఎలివేష‌న్లు ఉండ‌వు.. ఈ నీర‌స‌న‌మైన క‌థ‌లో చిరంజీవిని బ‌ల‌వంతంగా ఇరికించేశాడు. అస‌లు చిరు క్యారెక్ట‌ర్ నీర‌సంగా ఉండ‌డం మెగాభిమానుల‌కే న‌చ్చ‌లేదు.

ఇక అఖండ‌కు థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అస‌లు అఖండ విజ‌యంలో సంగం మ్యూజిక్‌కే ఇవ్వాలి. అస‌లు అఖండ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు పూన‌కాలు వ‌చ్చిన‌ట్టు ఊగిపోయారు. పాట‌లు కూడా బాగున్నాయి. ఆచార్య‌లో పాట‌లు రిలీజ్‌కు ముందు బాగున్నా థియేట‌ర్లో తేలిపోయాయి. స‌రే పాట‌ల‌తో ఎలాగోలా స‌రిపెట్టుకున్నా ఆర్ ఆర్ మాత్రం మ‌ణిశ‌ర్మ బాగా డిజ‌ప్పాయింట్ చేశాడు.

ఇక అప్పుడెప్పుడో ఆచార్య షూటింగ్ పూర్త‌య్యింద‌న్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కొత్త షెడ్యూల్ మొద‌లైంద‌న్నారు. అప్పుడే అంద‌రికి అనుమానం వ‌చ్చింది. ఇక అఖండ‌లో బాల‌య్య విల‌న్ల‌ను చంపి త్రిశూలంతో పైకి ఎత్తుతాడు. అస‌లు ఆ సీన్ ఎలివేష‌న్ మామూలుగా ఉండ‌దు. ఆచార్య‌లోనూ ఓ సంద‌ర్భంలో చిరంజీవి ఇలాగే చేస్తాడు. అయితే ఈ సీన్ చాలా పేల‌వంగా ఉంది. ఇక రెండు సినిమాల్లో ఆధ్యాత్మిక‌త ఉంది. అఖండ‌లో లాజిక్ లేని సీన్లు చాలా ఉన్నా.. బేసిక్స్ ప‌రంగా బోయ‌పాటి లైన్ క్రాస్ చేయ‌లేదు.

ఆచార్య‌లో అటు ధ‌ర్మం, భ‌క్తికి న‌క్సలిజం జోడించ‌డం.. అస‌లు న‌క్స‌లిజం ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు క‌నెక్ట్ అయ్యే స‌బ్జెక్ట్ కాక‌పోవ‌డంతో క‌థ‌తో ప్రేక్ష‌కుడు ట్రావెల్ కాలేదు. అఖండ క్లైమాక్స్ చూశాక‌.. ఆచార్య క్లైమాక్స్‌ను రీ షూట్ చేశార‌న్న టాక్ కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. అఖండ క్లైమాక్స్ ఫైట్‌లో అదిరిపోయే మ్యాజిక్ రిపీట్ అయ్యింది. ఆచార్య‌లో ఆ ఫీల్ రాలేదు. ఇవ‌న్నీ క‌లిసి ఆచార్య‌కు మైన‌స్ అయితే.. అఖండకు బాల‌య్య న‌ట‌న‌, బీజీఎం, ఎలివేష‌న్లు ప్ల‌స్ అయ్యి సూప‌ర్ స‌క్సెస్ చేశాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news