సోషల్ మీడియా వచ్చాక ఎంత మంచి జరుగుతోందో.. అంతే చెడు మరోవైపు కూడా జరుగుతోంది. సాధారణ జనాలు ఏమోగాని సెలబ్రిటీలు మాత్రం సోషల్ మీడియాతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మంచి ఎంత స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతోందో.. రెండో వైపు చెడు కూడా అంతే చాపకింద నీరులా పాకుకుపోతోంది. ఇక హీరోయిన్లు కూడా కొంత హాట్ హాట్‌గా రెచ్చగొట్టే ఫొటోలతో నెటిజన్లకు ఎర వేస్తున్నారు. వాళ్ల పాపులారిటీ వాళ్లకు కావాలి… వాళ్లు అంత హాట్‌గా ఉంటేనే జనాల అటెన్షన్లో ఉంటామనుకుంటూ ఉంటారు.
ఇటు నెటిజన్లు అంత హాట్‌గా కనిపిస్తే ఊరుకుంటారా ? చాటింగ్లకు వచ్చినప్పుడు, ఇటు కామెంట్ బాక్సుల్లో ఏదో ఒకటి కెలుకుతూ ఉంటారు. ఇందులో కొన్ని ప్రశ్నలు ఇంట్రస్టింగ్‌గా ఉంటే.. మరికొన్ని వాళ్లను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనసూయ, రష్మీ లాంటి వాళ్లను నెటిజన్లు తమ ప్రశ్నలతో ఎలా కెలుకుతూ ఉంటారో ? అనసూయ లాంటి వాళ్లు కోపంతో ఎలా రుసరుసలాడిపోతూ ఆన్సర్లు ఇస్తారో ? చూస్తూ ఉంటాం.
ఇటు సౌత్ నుంచి అటు నార్త్ వరకు ఈ అమ్మడు మాంచి పాపులరే. మధ్యలో ఫేడవుట్ అయిపోయినా.. ఇప్పుడు ఇటు బాలయ్య సినిమాతో ప్రభాస్ – ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఫామ్‌లోకి వచ్చేసింది. ఈ రెండు ఛాన్సులే ఇప్పట్లో శృతిని ప్రేక్షకులు మర్చిపోకుండా నిలబెట్టేశాయి. సలార్ హిట్ అయితే పాన్ ఇండియా లెవల్లో మళ్లీ ఆమె స్టార్ హీరోయిన్ అవుతుంది.
తాజాగా ఈ అమ్మడుకు ఓ నెటిజన్ నుంచి ఓ షాకింగ్ ప్రశ్న ఎదురైంది. అంతే చమక్గా ఆమె ఆన్సర్ ఇచ్చి ఔరా అనిపించారు. తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ అభిమాని మీ లిప్ సైజ్ ఎంత ? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఆమె కూడా అంతే కూల్‌గా ఆన్సర్ ఇచ్చింది. తనను ఈ ప్రశ్న వేసిన వ్యక్తిని ట్యాగ్ చేస్తూ లిప్ సైజు కూడా ఉంటుందా ? అని కొంటెగా రిప్లై ఇచ్చింది.
శృతి ఇచ్చిన రియాక్షన్‌కు నెటిజన్లు షాక్ అవుతున్నారు. శృతి మామూలుగా షాక్ అవ్వలేదుగా.. మామూలు అమ్మాయి కాదని అంటున్నారు. ఇక పాత బాయ్‌ఫ్రెండ్‌కు బైబై చెప్పేసిన ఈ అమ్ముడు ఇప్పుడు కొత్త రిలేషన్లో ఉంది. మరి ఈ రిలేషన్‌ను అయినా ఆమె పెళ్లి వరకు తీసుకు వెళుతుందో ? లేదో ? చూద్దాం.