అభిమానులతో పాటు బడా బడా సెలబ్రీటీలు కూడా..ఈగర్ వేయిట్ చేస్తున్నారు రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి చేసుకుంటే చూడాలని. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీళ్లు ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు..కానీ మాయదారి మహమ్మారి కరోనా కారణంగా వీళ్ళ పెళ్లికి బ్రేక్ పడ్డింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త అటు బాలీవుడ్ మీడియాలోను..ఇటు టాలీవుడ్ లోను కోడై కూస్తుంది.
ఈ లవ్ బర్డ్స్ జంట ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ జంట ఏప్రిల్ రెండో వారంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే చాలా సింపుల్ గా..నిరాడంబరంగా రణబీర్, అలియా వివాహం జరగనున్నట్లు తెలుస్తుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నారని సన్నిహితుల దగ్గర నుండి అందుతున్న సమాచారం. అయితే.. రణబీర్, అలియా తమ వివాహానికి సంబంధించిన పనులను కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా చేయించుకున్నారంటూ ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
అలియా- రణబీర్ తమ పెళ్లిని చాలా సీక్రేట్ గా ఉంచాలని చూస్తున్నారట. ఫ్యాన్స్ హడావుడి లేకుండా కేవలం రిలేటీవ్స్ మధ్య ఒక్కటి కావాలనుకుంటున్నారట. అందుకోసం వీరు ప్రత్యేకంగా తమ వెడ్డింగ్ టీమ్ ని కాంట్రాక్టు అడుగుతున్నారట. ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, పెళ్లి పనులు చేసేవారు, డెకరేషన్ టీమ్, డీజే టీమ్, డిజైనర్ టీమ్ ఇలా పెళ్లి కోసం పనిచేసే ప్రతిఒక్కరి వద్ద కాంట్రాక్ట్ రాయించుకొని సంతకాలు పెట్టించుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఒక్కవేళ్ళ బై మిస్టేక్ అయినా ఒక్క ఫోటో బయటకు వచ్చినా.. కాంట్రాక్ట్ లోని అగ్రిమేంట్ ప్రకారం వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వరట. దీంతో వీళ్ల పెళ్లికి సంబంధించిన ఈ కాంట్రాక్ట్ పద్ధతి హాట్ టాపిక్ గా మారింది.