Moviesమాజీ భ‌ర్త చైతు, మ‌రిది అఖిల్‌కే స‌వాల్ విసిరిన స‌మంత‌.. మామూలుది...

మాజీ భ‌ర్త చైతు, మ‌రిది అఖిల్‌కే స‌వాల్ విసిరిన స‌మంత‌.. మామూలుది కాదుగా…!

అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక క్రేజీ హీరోయిన్ సమంత రేంజ్ మ‌రింత పెరిగిపోయింది. సాధార‌ణంగా పెళ్లి, విడాకుల త‌ర్వాత హీరోయిన్ల‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రావు. పైగా క్రేజ్ కూడా త‌గ్గిపోతూ ఉంటుంది. అయితే స‌మంత విష‌యంలో ఇవ‌న్నీ రివ‌ర్స్ అయిపోయాయి. పెళ్లి చేసుకున్నాకే రంగ‌స్థ‌లం లాంటి సినిమాతో ఆమె క్రేజ్ మ‌రింత పెరిగింది. పెళ్ల‌య్యాక భ‌ర్త‌తో చేసిన మజిలీ సూప‌ర్ హిట్‌. ఇక విడాకులు తీసుకున్నాకే పుష్ప సినిమాలో ఊ అంటావా మావ సాంగ్ ఎంత ర‌చ్చ రంబోలో చేసి.. స‌మంత‌కు హాట్ ఇమేజ్ తీసుకువ‌చ్చిందో చూశాం.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఆమె గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం సినిమాతో పాటు య‌శోద అనే థ్రిల్ల‌ర్ సినిమా కూడా చేస్తోంది. ఇక బాలీవుడ్‌, కోలీవుడ్‌, హాలీవుడ్ ఆఫ‌ర్ల‌తోనూ అద‌ర గొట్టేస్తోంది. బోల్డ్ ఇమేజ్ విష‌యంలో స‌మంత ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఇక స‌మంత న‌టిస్తోన్న య‌శోద సినిమా రిలీజ్ డేట్‌ను ఆగ‌స్టు 12గా ఫిక్స్ చేశారు. హ‌రి – హ‌రీశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మించారు.

అయితే ఈ సినిమా త‌న మాజీ భ‌ర్త చైతు, మ‌రిది అఖిల్ సినిమాల‌తో పోటీ ప‌డుతోంది. య‌శోద‌ను పాన్ ఇండియా లెవ‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఒక రోజు ముందు అమీర్ ఖాన్‌ లాల్‌ సింగ్‌ చద్దా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమాతోనే అక్కినేని నాగ‌చైత‌న్య బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. అంటే మాజీ భార్య భ‌ర్త‌లు త‌మ సినిమాల‌తో ఒక్క రోజు గ్యాప్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు.

ఇక స‌మంత మాజీ మ‌రిది అఖిల్ న‌టిస్తోన్న ఏజెంట్ సినిమాను కూడా ఆగ‌స్టు 12నే రిలీజ్ చేస్తున్నారు. మేక‌ర్స్ ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఏజెంట్ సినిమాకు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఏదేమైనా స‌మంత అక్కినేని ఫ్యామిలీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆ ఫ్యామిలీకే చెందిన ఇద్ద‌రు హీరోల సినిమాల‌తో పోటీగా త‌న య‌శోద సినిమాతో వ‌స్తోంది.

ఇది ఇంట్ర‌స్టింగ్ పోటీయే. మాజీ భార్య‌, భ‌ర్త‌ల‌తో పాటు మ‌రిది మ‌ధ్య జ‌రిగే ఈ ట్ర‌యాంగిల్ ఫైట్‌లో ఎవ‌రు పై చేయి సాధిస్తారు ? టాలీవుడ్‌లో చైతు సినిమా ఎంత వ‌ర‌కు ప్ర‌భావం చూపుతుంది. లేదా చివ‌ర్లో ఈ ముగ్గురిలో ఎవ‌రు రేస్ నుంచి త‌ప్పుకుంటారు ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news