MoviesRRR హీరోయిన్ ఒలివియా మోరిస్ ఫ్యాన్స్‌కు మామూలు షాక్ ఇవ్వ‌లేదుగా..!

RRR హీరోయిన్ ఒలివియా మోరిస్ ఫ్యాన్స్‌కు మామూలు షాక్ ఇవ్వ‌లేదుగా..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంకా వ‌సూళ్ల ప‌రంప‌ర కొన‌సాగిస్తూనే ఉంది. సినిమాపై ముందు నుంచి ఎలాంటి ? అంచ‌నాలు ఉన్నాయో ఆ అంచ‌నాలు సినిమా అందుకుంది. ఇప్ప‌టికే రు. 900 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు దాటేసిన ఈ సినిమా త్వ‌ర‌లోనే రు. 1000 కోట్ల‌ను క్రాస్ చేయ‌నుంది. ఇక ఓవ‌ర్సీస్‌లోనే ఈ సినిమాకు 13 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. అటు బాలీవుడ్‌లోనూ రు. 200 కోట్ల మార్క్‌కు చేరువైంది. త్రిబుల్ ఆర్‌లో ఎన్టీఆర్ కొమ‌రం భీంగా, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించారు.

రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియాభ‌ట్ న‌టిస్తే… తార‌క్‌కు జోడీగా బ్రిటీష్ న‌టి ఓలివీయా మోరిస్ న‌టించింది. సినిమా రిలీజ్‌కు ముందు అస‌లు ఓలివియా గురించి స్టిల్స్ కూడా బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో ఈ పాత్ర‌కు ఏ మాత్రం ప్రాధాన్య‌త ఉండ‌ద‌నే అనుకున్నారు. అలియానే హైలెట్ అవుతుంద‌న్న అంచ‌నాలే ఉన్నాయి. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే ఓలివియాను ప్రేమ‌లో ప‌డేసేందుకు ఎన్టీఆర్ ప‌డిన పాట్లు.. ఎన్టీఆర్‌కు, ఆమెకు మ‌ధ్య వ‌చ్చే సీన్లే హైలెట్ అయ్యాయి.

అలియా భ‌ట్ చేయ‌డానికి కూడా ఏం లేకుండా పోయింది. సినిమాలో ఒలీవియా మోరీస్ .. అలియా పాత్రను డామినేట్ చేసింది. ఒలీవియో చేసిన జెన్నీ పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. బ్రిటీష్ యువ‌రాణి జెన్నీగా క్యూట్ స్మైల్స్‌తో క‌ట్టి ప‌డేసింది. ఇక ఒలీవియా విష‌యానికి వ‌స్తే ఆమె వ‌య‌స్సు 25 సంవ‌త్స‌రాలు. ఆమె లండ‌న్‌లో జ‌న్మించింది. హాలీవుడ్ సినిమాల‌తో పాటు కొన్ని వెబ్ సీరిస్‌లు కూడా చేసింది.

ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటీష్ యువ‌రాణి పాత్ర‌లో ఓ అమ్మాయి కోసం రాజ‌మౌళి వెతుకుతున్న‌ప్పుడు ఆమె న‌టించిన వెబ్‌సీరిస్‌లు రాజ‌మౌళి చూశాడు. అలా ఆమెను కాంటాక్ట్ అవ్వ‌డంతో ఆమెకు త్రిబుల్ ఆర్ ఛాన్స్ వ‌చ్చింది. ఇక ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందికి తెలియ‌దు. ఆమెకు ఓ భాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఒలీవియా త‌న రీసెంట్ ఇంట‌ర్వ్యూల‌లో త‌న భాయ్ ఫ్రెండ్ కూడా నాటు నాటు సాంగ్‌కు డ్యాన్స్ నేర్చుకుంటున్నాడ‌ని చెప్పింది.

ఒలీవియా బాయ్ ఫ్రెండ్ పేరు జాక్ హమ్మెట్. అత‌డు థియేట‌ర్ ఆర్టిస్ట్‌.. వీరిద్ద‌రు గ‌త ఐదేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్ద‌రు క‌లిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమెకు భాయ్ ఫ్రెండ్ లేడని.. ఆమె క్యూట్ లుక్స్‌కు ప‌డిపోయిన ఆమె ఫ్యాన్స్ ఇప్పుడు ఒలీవియా – జాక్ ఫోటోలు వైరల్ అవ్వడంతో వాళ్లు మొత్తానికి నువ్వు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్‌ను సెట్ చేసేసుకున్నావంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news