బాహుబలి సినిమా దెబ్బతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి సినిమాలో రారాజుగా మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలిగా కనిపించేందుకు రాజమౌళి ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టం మామూలు కష్టం కాదు. దాదాపుగా ఐదేళ్ల పాటు ఒకే విధమైన ఫిజిక్ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. భయంకరమైన దేహధారుడ్యంతో కనపడడంతో పాటు బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ప్రభాస్.
సాహోలో దాదాపుగా అదే మెయింటైన్ అయ్యింది. ఐదేళ్ల కష్టం ఒక్కసారిగా పోదుగా.. అందుకే సాహో వరకు పెద్ద కంప్లైంట్లు లేవు. సాహో వచ్చి కూడా మూడేళ్లు అవుతోంది. అయితే రాధేశ్యామ్‌లో ప్రభాస్‌ను చూసే వాళ్లకు మతులు పోయాయి. సినిమాతో పాటు బయట ప్రభాస్‌ను చూసిన వారైతే అవాక్కైపోయారు. ప్రభాస్ లుక్ పోయింది. ఫేస్ వేల్యూ కూడా గతంలో ఉన్నంత లేదు. ఏదో పీక్కు పోయినట్టు ఉంది. పైగా ప్రభాస్ వాకింగ్ స్టైల్ కూడా చాలా మారిపోయింది.
ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌ను కవర్ చేసేందుకు సీజీ వర్క్ కోసమే ఏకంగా రు. 10 కోట్లు ఖర్చయ్యిందట. ఇదిలా ఉంటే మెకాలు సర్జరీ జరగడంతో ప్రభాస్‌కు జిమ్‌లో వర్కవుట్లు చేసే టైంలేదట. దీంతో ప్రభాస్ మరింత లావు అయిపోయాడు. బాహుబలి సినిమాకు చాలా అందంగా కనిపించిన ప్రభాస్, సాహోలో చాలా స్టైలీష్‌గా ఉన్న ప్రభాస్ రాధేశ్యామ్‌కు వచ్చే సరికి నీరసంగా ఉన్నాడు.
ఇప్పుడు సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే ఇలా పాన్ ఇండియా ప్రాజెక్టులే ఉన్నాయి. ప్రభాస్‌కు పాన్ ఇండియా ఇమేజ్ రావడానికి అతడి ఫిజిగ్ కూడా ఓ కారణం. కానీ ఇప్పుడు అదే తేడా కొడితే తర్వాత ఫలితాలు కూడా రాధేశ్యామ్ లాగానే ఉంటాయి. దీనికి తోడు ప్రభాస్ ఆరోగ్యంపై పెద్దగా కాన్‌సంట్రేషన్ చేయడన్న టాక్ కూడా ఉండస్ట్రీలో ఉంది. లేట్ నైట్లు బాగా చేస్తాడట. ఆహార ప్రియుడు… ఏవీ కావాలన్నా తినేస్తాడు.
పైగా తాను తినడంతో పాటు తనతో పాటు చేసే హీరోయిన్లకు, షూటింగ్‌లో ఉండే వాళ్లకు కూడా పది రకాలకు పైగా ఐటెంలతో ఇంకా చెప్పాలంటే ఏపీలోని గోదావరి జిల్లాల నుంచి రకరకాల ఫుడ్ ఐటెంలు తెప్పించి మరీ ఆథిత్యం ఇస్తూ ఉంటాడు. తాను కూడా తిండి విషయంలో రాజీపడడు. సరే సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్‌లతో సినిమాల్లో లుక్ కవర్ చేసుకున్నా.. బయట కవర్ చేయలేరు కదా..! షూటింగ్‌లో యాక్టివ్‌గా ఉండాలన్నా.. తాను ఓకే చేసుకున్న ప్రాజెక్టులు స్పీడ్‌గా పూర్తవ్వాలన్నా ఫిజిక్ మీద కూడా దృష్టి పెట్టడం మంచిది.