దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా మూడున్నర సంవత్సరాల తర్వాత ఊరిస్తూ ఎట్టకేలకు మార్చి 25న థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా మంచి విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రు. 710 కోట్ల వసూళ్లు రాబట్టేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు రు. 190 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ సినిమా నైజాంలో ఏకంగా రు. 90 కోట్ల షేర్ కొల్లగొట్టింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా లాంగ్‌రన్‌లో ఈ సినిమా రు. 1000 కోట్ల షేర్ కొల్లగొడుతుందన్న అంచనాలు ఉన్నాయి. అటు హిందీలో ముందు నుంచి వీక్ అన్నారు. అయితే ఇప్పుడు అక్కడ రు. 100 కోట్లు దాటేసి రు. 150 కోట్లకు చేరువ అయ్యింది. పైగా హిందీ బెల్ట్‌లో వసూళ్లు స్టడీగా ఉన్నాయి. ఉగాదితో పాటు వీకెండ్ రావడం త్రిబుల్ ఆర్‌కు కలిసి వచ్చింది. ఆర్ ఆర్ విషయంలో అన్ని బాగానే ఉన్నాయి. సినిమా విజయం కోసం వెయిట్ చేసిన వారందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
అయితే త్రిబుల్ ఆర్ తర్వాత తెలుగులో వస్తోన్న పెద్ద సినిమా ఆచార్య. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్‌చరన్ కూడా ఉన్నారు. త్రిబుల్ ఆర్ పాత్రతో రామ్‌చరణ్ రామ్‌గా నార్త్‌లో కొందరికి కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆచార్యను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తారనే అందరూ అనుకున్నారు. అయితే మేకర్స్ ఈ విషయంలో బాగా డిజప్పాయింట్ చేసేశారు.
మా టార్గెట్ పాన్ ఇండియా కాదని.. ప్రస్తుతం మా దృష్టంతా తెలుగు మీదే ఉందని.. తెలుగులో మాత్రమే ఈ సినిమాను 2 వేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఓవర్సీస్‌లో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఏదేమైనా ఆచార్యను ముందు నుంచి అభిమానులు పాన్ ఇండియా రేంజ్‌లో ఊహించుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో రావడం లేదని చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు. ఏదేమైనా మంచి ఛాన్స్ ఉండి కూడా ఆచార్య విషయంలో మేకర్స్ వాడుకోవడం లేదు.