Moviesనిహారికాకు ప‌వ‌న్ స్ట్రాంగ్ క్లాస్‌... త‌న బాధ ఇలా బ‌య‌ట పెట్టారా..!

నిహారికాకు ప‌వ‌న్ స్ట్రాంగ్ క్లాస్‌… త‌న బాధ ఇలా బ‌య‌ట పెట్టారా..!

నిన్నంతా మెగా ఫ్యామిలీ మాన‌సికంగా కుంగిపోయే ఉంటుంది. బంజారాహిల్స్‌లో ఓ ప్రైవేట్ హోట‌ల్లో రేవ్ పార్టీ అంటూ తెల్ల‌వారు ఝామునే పోలీసుల దాడులు జ‌రిగాయి. చాలా మంది సెల‌బ్రిటీల పిల్ల‌లు ప‌ట్టుబ‌డ్డారు. వీరిలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక కూడా ఉంది. ఆ త‌ర్వాత ఆమెను పోలీసులు తీసుకువెళ్లడం.. ఆమె కూడా డ్ర‌గ్స్ వాడారంటూ ర‌క‌ర‌కాల వార్త‌లు రావ‌డం ఇవ‌న్నీ మెగా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాయి. ఇక నిహారిక దొరికిపోయింద‌న్న వార్త‌ల‌ను మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చిలువ‌లు ప‌లువ‌లుగా ప్రచారం చేసేసింది.

చివ‌ర‌కు నాగ‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ డ్ర‌గ్స్ కేసులో అస‌లు నిహారికాక‌కు సంబంధమే లేద‌ని తేల్చిచెప్పారు. నిహారిక విష‌యంలో తాము క్లీయ‌ర్‌గా ఉన్నామ‌ని.. అస‌లు ఈ ఘ‌ట‌న‌లో ఆమె పేరు తెర‌మీద‌కు రావ‌డ‌మే బాధాక‌ర‌మ‌ని వాపోయారు. ఓ ఆడ‌పిల్ల తండ్రిగా నాగ‌బాబు ఆవేద‌న‌లో అర్థం ఉంది. ఇక నిహారిక ఆ టైంలో అక్క‌డ ఉండ‌డం కూడా త‌ప్పే.

నిహారిక పేరు ఈ విష‌యంలో బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమె బాబాయ్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ఆస‌క్తిక‌ర ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ఇప్పుడు ఈ ట్వీట్‌పై సోష‌ల్ మీడియాలో కూడా చ‌ర్చ న‌డుస్తోంది. ఈ ట్వీట్ నిహారికాకు ప‌వ‌న్ క్లాస్ తీసుకుంటున్న‌ట్టుగా ఉంద‌న్న అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌వ‌న్ ట్వీట్‌లో ఉన్న సారాసం ఇలా ఉంది.

బీసీలు, ఎస్సీలు క‌లిసి రాజ్యాధికారాన్ని సాధించేందుకు రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటూ వాకాడ శ్రీనివాస్ కోట్‌ను తాను పేర్కొంటున్నాన‌ని ప‌వ‌న్ చెప్పాడు. శ‌త్రువులు కూడా మ‌న‌ల‌ను వాడుకోగ‌లిగేంత మూర్ఖ‌త్వం మ‌న‌ది… అవ‌త‌లివాడు మ‌న‌ల‌ను వాడుకోవ‌డ‌మే మ‌న విజ‌యం అని భ్ర‌మ‌ప‌డేంత అమాయ‌క‌త్వం కూడా మ‌న‌దే అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ప్ర‌స్తుతం డ్ర‌గ్స్ ఇష్యూలో త‌మ ఇంటి ఆడ‌ప‌డుచు నిహారిక పేరు రావ‌డం.. దానిని మీడియా ఇష్టం వ‌చ్చిన‌ట్టు చూపిస్తూ ఉండ‌డంతో ప‌వ‌న్ త‌న అస‌హ‌నాన్ని ఇలా ప‌రోక్షంగా వెల్ల‌డించారా ? అని చెపుతున్నారు. అస‌లు ఈ అంశంతో నిహారిక‌కు సంబంధం లేక‌పోయి ఉండొచ్చు.. నాగ‌బాబు సైతం ఇదే విష‌యం అన్నారు. అయితే ఈ అంశాన్ని రాజ‌కీయాల‌కు ముడిపెట్టేసి.. సున్నితంగా త‌మ‌ను ఇబ్బంది పెట్టేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఆ ఛాన్స్ నిహారిక చేజేతులా ఇచ్చిన‌ట్ల‌య్యింద‌ని ప‌వ‌న్ త‌న అస‌హ‌నం ఇలా బ‌య‌ట పెట్టార‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news