Movies' KGF 2 ' ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌... బొమ్మ డ‌బుల్...

‘ KGF 2 ‘ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌… బొమ్మ డ‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌… కుమ్మేశాడ్రా బాబు..!

క‌న్న‌డ KGF చాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్‌గా రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన KGF 2 సినిమా మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చి ఎట్ట‌కేల‌కు ఈ నెల 14న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1 సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ సినిమాపై లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. భారీ పాన్ ఇండియా లెవ‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా నార్త్ లేదు సౌత్ లేదు.. ఓవ‌ర్సీస్ లేదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా వ‌సూళ్ల దుమ్ము రేపుతోంది.

క‌న్న‌డ లాంగ్వేజ్‌లో తెర‌కెక్కినా కేజీయ‌ఫ్‌ను అన్ని భాష‌ల్లోకి డ‌బ్ చేశారు. కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1 హిట్ అయ్యి ఉండ‌డంతో ఈ సీక్వెల్‌పై ముందు నుంచి అంద‌రికి భారీ న‌మ్మ‌కాలే ఉన్నాయి. సినిమా చూసిన వారిని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ త‌న టేకింగ్‌తో క‌ట్టిప‌డేశాడు. ఇక కేజీయ‌ఫ్ 2 ఫ‌స్ట్ డేనే ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 165 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది.

ఫ‌స్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏరియా వైజ్ వ‌సూళ్లు చూస్తే మ‌తులు పోతున్నాయి. అస‌లు తెలుగుతో పాటు బాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమాల‌కే రాని విధంగా.. అందులోనూ బ‌డాబ‌డా స్టార్లు .. స్టార్ డైరెక్ట‌ర్లు కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమాల‌కే రాని వ‌సూళ్లు కేజీయ‌ఫ్ 2కు వ‌చ్చాయి. నార్త్‌లో 7వ రోజు రు 17.22 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టి.. హిందీ బెల్ట్ వ‌ర‌కే రు. 250 కోట్లు క్రాస్ చేసేసింది.

ఇక 7వ రోజు కేర‌ళ‌లో 3.5 కోట్లు సాధించి కేర‌ళ మ‌ళ‌యాళ వెర్ష‌న్ ఫ‌స్ట్ వీక్‌లో 41.8 కోట్లు రాబ‌ట్టింది. అస‌లు మ‌ళ‌యాళంలో ఈ రేంజ్ వ‌సూళ్లు ఏ సినిమాకు రాలేదు. త‌మిళ‌నాడులో ఆరు రోజుల‌కే రు. 55.49 కోట్లు రాబ‌ట్టిన ఈ సినిమా 7వ రోజు 5 కోట్ల‌కు పైగా కొల్ల‌గొట్టింది. కేజీయ‌ఫ్ దెబ్బ‌తో అక్క‌డ స్టార్ హీరో విజ‌య్ సినిమా బీస్ట్ అడ్ర‌స్ లేకుండా పోయింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికే 724 కోట్ల వ‌సూళ్లు కేజీయ‌ఫ్ 2 సొంతం అయ్యాయి. ఇదే దూకుడు మ‌రో వారం రోజులు కంటిన్యూ కానుంది. ఈ లెక్క‌న చూస్తే సెకండ్ వీక్‌లోనే ఈ సినిమా సులువుగా రు. 1000 కోట్లు దాటేసి.. త్రిబుల్ ఆర్ రు. 1100 కోట్ల రికార్డును కూడా కేక్ వాక్‌లా క్రాస్ చేయ‌నుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news