Moviesనజ్రియా నాని కోసమే ఎత్తిందా..?

నజ్రియా నాని కోసమే ఎత్తిందా..?

నాచురల్ స్టార్ నాని చాలా కాలం తరువాత “శ్యామ్ సింగరాయ్” సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అప్పటి నుండి నాని మళ్ళీ ఫాం లో వచ్చాడు. నాని చేతిలో ఇప్పుడు నాలుగు బడా సినిమాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. దానిలో ఒకటి “దసరా” సినిమా. ఈ మధ్యనే ఈ సినిమా నుండి నాని లుక్ బయటకి రాగా..అది చూసిన జనాలు ఇండస్ట్రీకి మరో పుష్ప అంటూ ఫిక్స్ అయిపోయారు. నాని మాస్ లుక్ లో అదరగొట్టేశారు. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది.

కాగా, నాని హీరో గా నటిస్తున్న మరో చిత్రం..” అంటే సుందరానికి..”..టైటిల్ తోనే సినిమా లో కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పేశాడు డైరెక్టర్ ఆత్రేయ. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫుల్ ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాను జూన్‌ 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో నే నిన్న హైదరబాద్ లో జరిగిన ఈవెంట్ లో టీజర్ విడుదల చేశారు.

అందరు ఆడపిల్లలు పుడుతున్న బ్రాహ్మణ కుటుంబంలో ఏకైక వారసుడిగా పుట్టిన సుందర్ ప్రసాద్ పై ఫ్యామిలీ చూపించే ప్రేమ ఫుల్ కామెడీ జోనర్ లో తెరకెక్కించిన్నట్లు తెలుస్తుంది. ఇక మడి ఆచారాలు ఫాలో అయ్యే ఫ్యామిలీలో పుట్టిన సుందర్.. ఫైనల్లి క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది..కుటుంబంలో ఎదురైయే ప్రశ్నలు..ఈ సినిమాలో మనం క్లీయర్ గా చూడవచ్చు.

కాగా, ఈ ఫంక్షన్ లో నాని ఈ సినిమా హీరోయిన్ గా చేస్తున్న మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ ఓ రేంజ్ లో పొగిడేశారు. ఆమె కు తెలుగు లో ఎందరో బిగ్ డైరెక్టర్స్ ఆఫర్స్ ఇవ్వడానికి కాల్ చేసినా ఫోన్ ఎత్తేలేదు అని..ఫైనల్ గా మా సినిమా కోసం ఆమె.. మూవీలో నటించడానికి అంగీకారం తెలిపింది. అందుకు ఆమెకు ధన్యవాదాలు”అంటూ చెప్పుకొచ్చారు నేచురల్‌ స్టార్‌ నాని. దీని పై ఇప్పుడు నెట్టింట వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఎంతమంది ఎదురుచూసిన ఎత్తని నజ్రియా..నాని కోసమే ఎత్తిందా..? ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news