టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కీర్తి సురేష్ తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా..తనకి మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది మాత్రం..మహానటి సినిమానే. సావిత్రి గారి బయోపిక్ లో అచ్చం సావిత్రి గారిలానే నటించి..మెప్పించి..మరో సావిత్రిగా అభిమానుల గుండెల్లో మరో ముద్ర వేసుకుంది.
నిజం చెప్పాలంటే మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ చాలా సినిమాలు చేసింది. కానీ వాటిల్లో ఒక్కటి అంటే ఒక్కటి సినిమా కూడా హిట్ అవ్వలేదు సరి కదా..కనీసం పాజిటివ్ టాక్ కూడా దక్కించుకోలేకపోయింది. అయినా కానీ, సినిమా అవకాశాలు ఆమెకు క్యూ కడుతూనే ఉన్నాయి అంటే దానికి కారణం మహానటి సినిమాలో ఆమె నటించిన తీరు.. అభిమానులను మెప్పించిన ఎక్స్ ప్రేషన్స్ అని చెప్పక తప్పదు.
అసలే కీర్తి సురేష్ కెరీయర్ అంతంత మాత్రంగా ఉంటే.. ఇప్పుడు కీర్తి తన కెరీర్ ని ఇంకా డౌన్ చేసుకునే పని చేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. యస్.. కీర్తి సురేష్ రీసెంట్ గా ఓ కోలీవుడ్ సినిమాకి కమిట్ అయ్యిందట. ఆ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ నే కానీ..ఓ 8 ఏళ్ల పాపకు తల్లిగా నటిస్తుందట. పెళ్లి చేసుకున్న భర్త బతుకుదెరువు కోసం విదేశాలకు పోయి అక్కడ కూలీ పనులు చేసి డబ్బులు పంపిస్తే ..ఇక్కడ బిడ్డతో అత్త ఆడపడుచుని చూసుకుంటూ ఉండే ఇళ్లాలిగా కీర్తి మనకు కనిపిస్తుందట.
అంతేకాదు.. సౌదీ లో భర్త చనిపోతే.. ఆయన శవం కోసం గవర్నమెంట్ తో పోరాడి.. న్యాయం వైపు నిలబడి.. తన హక్కులను తెలియజేస్తూ..ఏకంగా ప్రధాన మంత్రిని సైతం నిలదీసే రోల్ లో కనిపించనున్నారట కీర్తి. నిజానికి ఇలాంటి రోల్ కీర్తి లాంటి స్టార్ హీరోయిన్ చేయవల్సింది కాదు. కానీ కీర్తి ఎందుకు ఒప్పుకుందో తెలియడం లేదు. ఒక్కవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే కీర్తి కెరీర్ లో పెద్ద తిప్పలు ఎదురుకోవాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి కీర్తి ఏం చేస్తుందో..?