ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా తెరమీద నవ్వుతూ కనిపిస్తారు. వారి జీవితం ఎంతో ఆనందంగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి లైఫ్ అందరికీ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తోంది ప్రేక్షకులకు. కానీ ఇలా తెరమీద ఎంతో ఆనందంగా కనిపించే నటీనటులను కదిలిస్తే కన్నీరు పెట్టించే ఎన్నో విషాదకరమైన ఘటనలు ఉన్నాయి అన్న విషయం కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఇలా ఇప్పటి వరకు ఎంతోమంది సినిమాల్లో ప్రేక్షకులను అలరిస్తున్న వారి జీవితాలలో ఎన్నో విషాద సంఘటనలు ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలా పైకి నవ్వుతూ కనిపించినా ఇక ఎన్నో విషాదకర ఘటన లతో శోక సముద్రంలో మునిగి పోయిన వారిలో హీరోయిన్ సుప్రియ రెడ్డి కూడా ఉన్నారు.
హీరోయిన్ సుప్రియ రెడ్డి పేరు చెప్తే దాదాపు తెలుగు ప్రేక్షకులకు గుర్తుకురాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా హీరోయిన్ అని చెప్పగానే అందరూ గుర్తుపట్టేస్తూ ఉంటారు. అయితే మొదటి సినిమాలో తన అందం అభినయంతో ఆకట్టుకున్న సుప్రియ ఆ తర్వాత మాత్రం అవకాశాలను అందుకోలేకపోయింది. అక్కినేని నాగేశ్వరావు పెద్దకూతురు యార్లగడ్డ సరస్వతి దేవి కూతురు సుప్రియ.. హీరో సుమంత్‌కు అక్క అవుతుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జునకి స్వయానా మేనకోడలు.
తండ్రి యార్లగడ్డ సురేంద్ర ఒకప్పుడు పెద్ద నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సుప్రియ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మరణించడంతో ఆమె ఎంతగానో దుఃఖసాగరంలో మునిగి పోయారు. ఆ తర్వాత సుప్రియ బాగోగులు అన్ని కూడా అక్కినేని నాగేశ్వరరావు చూసుకున్నారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోయిన్ గా సెట్ అయ్యేలా చేయాలని అనుకున్న అది కుదరలేదు. ఆ ఒక్క సినిమాతోనే ఆమె ఆగిపోయింది.
తర్వాత ఉషాకిరన్ మూవీస్ బ్యానర్‌లో ఇష్టం సినిమాతో హీరోగా పరిచయం అయిన చరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుశాంత్ డెబ్యూ మూవీ కాళిదాసుకు దర్శకుడు కూడా అతనే. భర్త దర్శకుడిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలన్నీ చూసింది. తర్వాత భర్త విపరీతంగా తాగుడుకు బానిస అయ్యి చిన్న వయస్సులోనే మరణించాడు. ఆ బాధను దిగమింగుకుని సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను నిర్వహించి అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు చేపట్టడంతో పాటు గూఢచారి సినిమాతో మళ్లీ తెరపై రీ ఎంట్రీ ఇచ్చింది.