యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. టెంపర్‌కు ముందు వరకు ఎన్టీఆర్ వరుస ప్లాపులతో ఇబ్బంది పడ్డాడు. ఎన్టీఆర్ మార్కెట్ బాగా డల్ అయ్యింది. బహుశా ఎన్టీఆర్ కెరీర్‌లోనే అదో బ్యాడ్ పీరియడ్. కట్ చేస్తే టెంపర్ నుంచి ఎన్టీఆర్ పట్టిందల్లా బంగారం అయిపోయింది. టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ – జై లవకుశ – అరవింద సమేత వీరరాఘవ – త్రిబుల్ ఆర్.. ఇలా వరుస పెట్టి ఆరు హిట్లు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరుసగా ఆరు హిట్లు అంటే మామూలు విషయం కాదు.
త్రిబుల్ ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ తన జీవితంలో అత్యంత విలువైన మూడున్నర సంవత్సరాలు ఎందుకు కేటాయించినట్టు ? ఈ గ్యాప్‌లో బన్నీ లాంటి హీరోలు ఏకంగా అల వైకుంఠపురంలో, పుష్ప లాంటి రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసేశారు. మరీ ఎన్టీఆర్ ఇంత కష్టపడినా అనుకున్న స్థాయిలో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిందా ? అంటే లేదనే చెప్పాలి. సరే కొరటాల శివ సినిమాతో అయినా పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందా ? అన్న ఆశలు అయితే ఉన్నాయి.
అందుకే కథలో మార్పులు చేయడంతో పాటు హీరోయిన్‌గా కూడా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియాభట్‌ను తీసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఏ ప్రశాంత్ నీల్ సినిమాయో చేస్తేనే పాన్ ఇండియా ఇమేజ్, ఆ రేంజ్ అలా కంటిన్యూ అవుతుంది. అయితే అనూహ్యంగా కొరటాల తర్వాత అనిల్ రావిపూడి సినిమా చేసేందుకు తారక్ తాపత్రయ పడుతుండడమే ఎవ్వరికి అంతు పట్టడం లేదు.
అనిల్ రావిపూడి ఎఫ్ 3 కంప్లీట్ చేశాడు. తర్వాత బాలయ్యతో సినిమా చేస్తాడు. అనిల్ రావిపూడిని తక్కవ చేసి చూపడం లేదు. కెరీర్లో చేసినవి అన్నీ హిట్ సినిమాలే.. సూపర్ ట్రాక్ రికార్డ్. ఏదో నాలుగు కామెడీ సీన్లు.. ఓ మోస్తరు ఎమోషన్లతో సినిమాను హిట్ చేస్తూ ఉంటున్నాడే.. తప్పా అది ఆ హీరో కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రలో.. కెరీర్‌లో మర్చిపోలేని సినిమాగా అయితే ఉండదు.
కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా చేస్తే ఖచ్చితంగా అది తారక్ కు చాలా హెల్ఫ్ అవుతుంది. సినిమా అన్ని భాషల్లోనూ క్లిక్ అవుతుందా ? కాదా అన్నది కాసేపు పక్కన పెట్టేద్దాం. ఓ క్రేజ్ వస్తుంది.. నేషనల్ వైడ్‌గా ఎలివేషన్ ఉంటుంది. అదే అనిల్ రావిపూడి సినిమా చేసినా తెలుగులో హిట్ అవుతుంది.. అంతకు మించి ఎన్టీఆర్‌కు వచ్చేదే ఉండదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ కామెడీ సినిమా రిస్కే అవుతుంది. ఎన్టీఆర్‌కు ఎంత మాత్రం కలిసి రాదు.
ఇంకా కావాలంటే కొరటాల తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా లేకుంటే.. ప్రశాంత్ నీల్ లేదా మరో డైరెక్టర్‌తో సినిమా చేసుకున్నా ఓకే కాని.. అనిల్ రావిపూడితో ఇప్పుడు సినిమా వద్దనే ఎన్టీఆర్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ ఫైనల్‌గా ఏం చేస్తాడో ? చూడాలి.