Moviesఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ పెంచేశాడా... కొత్త రేటు ఇదే...!

ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ పెంచేశాడా… కొత్త రేటు ఇదే…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మూడేళ్ల పాటు స్క్రీన్ మీద క‌న‌ప‌డ‌కుండా త‌న అభిమానుల‌ను ఊరిస్తూ వ‌చ్చాడు. ఎట్ట‌కేల‌కు త్రిబుల్ ఆర్ సినిమాతో గ‌త నెల 25న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాడు. రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా రు. 1000 కోట్ల వ‌సూళ్ల‌తో ఇండియాలోనే ఆల్ టైం టాప్ వ‌సూళ్ల జాబితాలో 3 ప్లేస్‌కు చేరిపోయింది. కొమ‌రం భీంగా ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ యాక్టింగ్‌కు ఇండియ‌న్ సినిమా అభిమానులు, జ‌నాలు అంతా ఫిదా అయిపోయారు.

ఈ సినిమాతో ఎన్టీఆర్‌కు కంప్లీట్ పాన్ ఇండియా ఇమేజ్ వ‌చ్చిందా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే నార్త్ జ‌నాల‌కు బాగా క‌నెక్ట్ అయ్యాడు. ఇప్పుడు వ‌రుస పెట్టి చ‌క‌చ‌కా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇక‌పై అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవ‌ల్లోనే ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టిస్తోన్న సినిమా షూటింగ్ కూడా త్వ‌ర‌లోనే స్టార్ట్ కానుంది. ఈ క‌థ‌ను కూడా పాన్ ఇండియా లెవ‌ల్లో క‌నెక్ట్ చేసేందుకు కొర‌టాల టీం క‌ష్ట‌ప‌డుతోంది.

కొర‌టాల సినిమా కోసం ఎన్టీఆర్ త‌న రెమ్యున‌రేష‌న్ పెంచేసిన‌ట్టు తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ సినిమాకు ఎన్టీఆర్ ఏకంగా మూడేళ్ల టైం కేటాయించాడు. దాన‌య్య రెమ్యున‌రేష‌న్‌గా ఎంత ఇవ్వాల‌న్న చర్చ న‌డిచిన‌ప్పుడు రాజ‌మౌళి స్వ‌యంగా ఎన్టీఆర్‌, చ‌ర‌న్‌కు చెరో రు. 45 కోట్లు ఇప్పించాడు. ఈ సినిమాతో నేష‌న‌ల్ వైడ్‌గా ఎన్టీఆర్ మార్కెట్ అయితే ఎంతో కొంత పెరిగింది.

అందుకే ఇప్పుడు మ‌రో రు. 10 కోట్లు పెంచిన‌ట్టు తెలుస్తోంది. అంటే రు. 55 కోట్లు ఎన్టీఆర్‌కు రెమ్యున‌రేష‌న్‌గా ముడుతోంది. పాన్ ఇండియా రేంజ్ సినిమా అంటే ఆ మాత్రం రెమ్యున‌రేష‌న్ మామూలే. పైగా హిందీ రైట్స్‌, అటు క‌న్న‌డం, ఇటు త‌మిళంతో పాటు ఓవ‌ర్సీస్ మార్కెట్ భారీగా పెరిగింది. ఇక హిందీ శాటిలైట్ రైట్స్ రేటు కూడా బాగా పెరిగింది. పైగా త్రిబుల్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఆ మార్కెట్ అలాగే కంటిన్యూ అయితే ఎన్టీఆర్ మ‌రింత ఎత్తుకు వెళ్లిపోతాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news