సినిమాల్లో పాత్రల మధ్య వైవిధ్యం ఉంటుంది. ఒకే హీరోయిన్ ఒక హీరోకు ఓ సారి భార్యగా, మరోసారి ప్రేయసిగా.. మరో సారి చెల్లిగా కూడా నటించాల్సి రావచ్చు. ఆ పాత్రల స్వభావాన్ని బట్టి నటన ఉంటుందే కాని.. సినిమాల్లో వరుసలను బట్టి ఉండదు. ఒక సినిమాలో అక్కా చెల్లిగా నటించిన ఎన్టీఆర్ సావిత్రి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్‌కు మనవరాలిగా చేసిన శ్రీదేవి ఆ తర్వాత అదే ఎన్టీఆర్‌కు జోడీగా ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు చేశారు.
ఇక శ్రీదేవి తండ్రి ఏఎన్నార్‌తో పాటు కొడుకు నాగార్జునతోనూ నటించింది. ఇప్పుడు ఈ తరం జనరేషన్లోనూ ఇదే నడుస్తోంది. కాజల్, తమన్నా లాంటి వాళ్లు అటు చిరంజీవితో పాటు ఇటు రామ్‌చరణ్‌తోనూ నటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడున్న వాళ్లలో ఓ యంగ్ హీరోయిన్.. అక్కినేని హీరో నాగచైతన్యకు ఫ్రెండ్‌గా, ప్రేయసిగా, తల్లిగా నటించింది. మరి ఈ యంగ్ హీరో పక్కన ఇన్ని పాత్రల్లో కనిపించిన ఆ హీరోయిన్ ఎవరు ? ఆ స్టోరీ ఏంటో చూద్దాం.
నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమా 2016 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు తీస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. బంగార్రాజు ఈ యేడాది సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నాగ్‌తో పాటు నాగచైతన్య కూడా నటించాడు. చైతుకు జోడీగా కృతిశెట్టి నటించింది. సోగ్గాడేలో ఇద్దరు నాగార్జునల్లో ఓ నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, మరో నాగ్ పక్కన లావణ్య త్రిపాఠి నటించారు.
బంగార్రాజులో నాగచైతన్య బంగార్రాజుకు మనవడిగా నటించాడు. అంటే రాము, సీత కొడుకే ఈ చిన బంగార్రాజు అంటే ఈ లెక్కన లావణ్య చైతుకు తల్లి అవుతుంది. రమ్యకృష్ణ నానమ్మ అవుతుంది. అంతకుముందే చైతు – లావణ్య కలిసి యుద్ధం శరణం సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. అంతకంటే ముందు అక్కినేని ఫ్యామిలీ సినిమా మనంలో ఫ్రెండ్స్‌గా కనిపిస్తారు.
అలా ఈ తరం హీరోల్లో ఒకరిగా ఉన్న చైతుకు.. ఈ జనరేషన్ హీరోయిన్ అయిన లావణ్య తల్లిగాను, ఫ్రెండ్‌గాను, ప్రేయసిగాను మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించడం విశేషమే. ఇక చైతు.. బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌తో కలిసి నటించిన లాల్‌చద్దా ఆగస్టులో రిలీజ్‌కు రెడీ అవుతోంది.