Moviesజూనియ‌ర్‌ ఎన్టీఆర్ తల్లికి సీనియర్ నటి శ్రీలక్ష్మికి ఉన్న చుట్టరికం తెలుసా..!

జూనియ‌ర్‌ ఎన్టీఆర్ తల్లికి సీనియర్ నటి శ్రీలక్ష్మికి ఉన్న చుట్టరికం తెలుసా..!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో తెర మీద కనిపిస్తు ప్రేక్షకులను అలరించే హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు నటీనటుల గురించి కూడా అందరికీ తెలిసి ఉంటుంది. వారి వారి అభిమానులు కూడా ఆ ఫ్యామిలీల బ్యాక్‌గ్రౌండ్ గురించి చాలా ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు తెలుస్తూ ఉంటాయి. కొన్ని సార్లు మాత్రం సినిమా ఇండస్ట్రీ లో ఉండే నటీనటుల మధ్య ఎవరూ ఊహించని విధంగా రిలేషన్స్ కొనసాగుతూ ఉంటాయి. అయితే ఇవి చాలా త‌క్కువ సంద‌ర్భాల్లోనే బ‌య‌ట ప‌డుతూ ఉంటాయి. ఇలాంటివి చూసినపుడుపుడల్లా అవాక్కవడం ప్రేక్షకుల వంతు అవుతుంది.

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఓ సంచ‌ల‌నం. త‌మ నంద‌మూరి వంశానికే సాధ్య‌మైన విధంగా పౌరాణిక‌, సాంఘీక‌, చారిత్ర‌క పాత్ర‌ల్లో న‌టించి మెప్పించ‌డం.. ఈ త‌రం జ‌న‌రేష‌న్లో ఎన్టీఆర్‌కే సాధ్యం. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ బాల రామాయ‌ణంతోనే ఫ్రూవ్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ హరికృష్ణ వారసుడు అనే విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ హరికృష్ణ మొదటి భార్య కుమారుడు కాగా… ఎన్టీఆర్ మాత్రం రెండో భార్య షాలిని కుమారుడు.

హ‌రికృష్ణ – షాలిని దంప‌తుల‌కు ఎన్టీఆర్ ఒక్క‌డే కుమారుడు. నంద‌మూరి ఫ్యామిలీ అభిమానుల‌ను మూడో త‌రంలోనూ మెప్పిస్తోన్న స్టార్ హీరోగా ఎన్టీఆర్ ఆ కుటుంబ అభిమానుల ఆశ‌ల‌ను నిల‌బెడుతున్నాడు. ఇక రాజ‌కీయంగా కూడా ఎన్టీఆర్‌పై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో తెలిసిందే. ఎన్టీఆర్ త‌న భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి పిల్ల‌ల‌తో పాటు త‌ల్లి షాలినితో క‌లిసే ఉంటాడు.

ఇక టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి, కామెడీ ఆర్టిస్ట్ అయిన శ్రీ ల‌క్ష్మి గురించి ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు త‌క్కువే తెలిసినా అప్ప‌ట్లో ఆమె కామెడీ టైమింగ్ కేక‌. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఆమె చేసింది త‌క్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌ముఖ యంగ్ హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేష్ ఎవ‌రో కాదు శ్రీల‌క్ష్మికి సొంత మేన‌కోడ‌లు. శ్రీ ల‌క్ష్మి త‌మ్ముడు రాజేష్ కూతురే ఐశ్వ‌ర్య‌.

ఇక శ్రీల‌క్ష్మికి, జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి షాలినికి చిన్న లింక్ ఉంది. న‌టి శ్రీ ల‌క్ష్మి స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యం చెప్పింది. తాను, మా అక్క‌డ ఎన్టీఆర్ త‌ల్లి షాలిని క్లాస్‌మెట్స్ అని.. చిన్న‌ప్ప‌టి నుంచి తామంద‌రం ఒకే ద‌గ్గ‌రే ఆడుకున్నామ‌ని.. పెరిగామ‌ని చెప్పింది. అయితే ఈ విష‌యం తాను ఎప్పుడూ చెప్ప‌లేద‌ని… ఇప్పుడు సంద‌ర్భం వ‌చ్చినందునే బ‌య‌ట పెట్టాన‌ని శ్రీల‌క్ష్మి తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news