టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తక్కువ టైంలోనే యూత్‌లో తనకంటూ ఓ వింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్లు అయితే ఉన్నాయి. శౌర్య అంటే అమ్మాయిల్లోనూ క్రేజ్ ఉంది. ఒకటి రెండు మంచి హిట్లు పడితే శౌర్య కెరీర్ ఫికప్ అయిపోయినట్టే. ఇక నాగశౌర్యకు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. శౌర్య కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇది చాలా ఇంటర్వ్యూల్లో రిపీట్ అయ్యింది. ఇటు ఎన్టీఆర్ కూడా శౌర్య విషయంలో చాలా సార్లు పాజిటివ్‌గానే స్పందించాడు.
ఈ క్రమంలోనే కొంత కాలంగా ఎన్టీఆర్‌కు, శౌర్యకు బంధుత్వం ఉందన్న టాక్ ఒకటి బయటకు వచ్చింది. వీరిద్దరు కజిన్స్ అవుతారని కూడా ప్రచారమూ ఉంది. ఈ బంధుత్వం వార్తలపై నాగశౌర్య తల్లి ముల్ఫూరి ఉషా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్‌కు, నాగశౌర్యకు ఎలాంటి బంధుత్వం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే తమ కుమారుడు నాగశౌర్యకు నందమూరి ఫ్యామిలీ అంటే మాత్రం ఎంతో ఇష్టం అని చెప్పారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కజిన్.. నాగశౌర్యకు బెస్ట్ ఫ్రెండ్ అని.. అంతకు మించి వీరిద్దరి మధ్య ఎలాంటి బంధుత్వాలు లేవని స్పష్టం చేశారు. పర్సనల్‌గా ఎన్టీఆర్, నందమూరి ఫ్యామిలీ అంటే గౌరవం ఉందని.. దానికే కొందరు బంధుత్వాలు కలిపేవారని ఉష చెప్పారు. మేం ఫ్యామిలీ ఫ్రెండ్సే తప్పా.. బంధువులం కాదని చెప్పింది. ఇక తన కుమారుడు నాగశౌర్య గురించి కూడా ఉష చెప్పింది.
శౌర్య మొబైల్ ఫోన్ కూడా వెంట తీసుకు వెళ్లడని.. వాడు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చారు. ఇక శౌర్య విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు తీస్తూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతున్నాడంటూ ఆమె మెచ్చుకున్నారు. ఆ పాత్రలే నాగశౌర్యను తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన హీరోగా నిలబెట్టాయని చెప్పుకువచ్చింది.