మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల పాటు సినిమా రంగానికి దూరంగా ఉన్నారు. 2007లో వచ్చిన శంకర్‌దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరు ఆ తర్వాత పదేళ్లు రాజకీయాల్లో రకరకాల పదవుల్లో బిజీ అయిపోయారు. చివరకు 2017లో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. పదేళ్లు గ్యాప్ తీసుకున్నా చిరు అంటే టాలీవుడ్‌లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. టైమ్ గ్యాప్ అంతే టైమింగ్‌లో తేడా లేదు అని ఆ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్ ఆయనకు కరెక్టుగా సూట్ అవుతుంది.
ఇక చిరు రీ ఎంట్రీ సినిమాను నిర్మించాలని చాలా మంది పెద్ద నిర్మాతలు, బడా నిర్మాతలు క్యూలో ఉన్నారు. అయితే ఈ గోల్డెన్ ఛాన్స్ చిరు తనయుడు రామ్‌చరణ్ స్వయంగా కొణిదెల ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్ స్థాపించి నిర్మించారు. ఈ బ్యానర్‌లోనే సైరా సినిమా కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. రామ్‌చరణ్ తన కొణిదెల బ్యానర్‌పై యంగ్ హీరోలతో కొత్త దర్శకులను పరిచయం చేస్తూ సినిమాలు వరుసగా తీస్తానని కూడా ప్రకటించారు. అయితే చెర్రీ కూడా రకరకాలుగా బిజీగా ఉండడంతో ప్రస్తుతం కొంత కాలం పాటు కొణిదెల బ్యానర్ వ్యవహారాలకు బ్రేక్ పడనుంది.
ఇదిలా ఉంటే వరుసకు చిరుకు కుమార్తె అయ్యే చిరు తోడళ్లుడు కుమార్తె విద్య కొణిదెల కంపెనీకి నిన్న మొన్నటి వరకు సీఈవోగా పని చేసింది. సైరా వ్యవహారాలు మొత్తం ఆమె కనుసన్నల్లోనే నడిచాయి. అయితే ఇప్పుడు ఆ బ్యానర్ కొంత కాలం పాటు సినిమాకు బ్రేక్ ఇచ్చే ఛాన్సులు ఉండడంతో ఇప్పుడు ఆమె గీతా కాంపౌండ్‌కు షిఫ్ట్ అయిపోయిందట. అంటే పెదనాన్న కంపెనీ నుంచి ఆమె మేనమామ కంపెనీకి చెక్కేసింది.
ప్రస్తుతం గీతా బ్యానర్లో వరుస పెట్టి సినిమాలు వస్తున్నాయి. అటు గీతా సంస్థతో పాటు ఇటు గీతా 2 బ్యానర్లో వరుసగా సినిమాలు వస్తున్నాయి. పైగా వీళ్లకు ఆహా డిజిటల్ ప్లాట్ ఫాం ఉంది. ఎన్నో వెబ్‌సీరిస్‌లు ప్లాన్ చేస్తున్నారు. అన్‌స్టాపబుల్ లాంటి బ్లాక్‌బస్టర్ షో కూడా చేస్తున్నారు. ఇక్కడ అయితే విద్యకు కావాల్సినంత పని ఉంటుంది. అందుకే ఆమె గీతా కాంపౌండ్‌లో జాయిన్ అయ్యిందని అంటున్నారు.
ప్రస్తుతం నిఖిల్-అనుపమ నటించిన 18 పేజెస్ సినిమా వ్యవహారాలు అన్ని విద్య కనుసన్నల్లోనే జరుగుతున్నాయట. ఇక విద్య మేనమామకే చెందిన గీతా సంస్థలో ఫ్యూచర్ లో కీ రోల్ పోషిస్తారని అక్కడ ప్రచారం నడుస్తోంది. ఇప్పటి వరకు గీతా సంస్థల్లో బన్నీ వాస్ కీలకంగా ఉన్నారు. ఆయనతో పాటు విద్య కూడా ఇక్కడ ఇప్పుడు కీలకం అవుతుంది.