బాలయ్య అఖండ గోల ఇప్పట్లో ఆగేలా లేదు. ఏ ముహూర్తానా కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలయ్య డేర్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేశాడో కాని అప్పటి నుంచి అఖండ మోత ఆగడం లేదు. బాలయ్య కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఉండొచ్చు.. కానీ వసూళ్లు, షేర్ పరంగా అఖండే టాప్ ప్లేసులో నిలిచింది. అసలు మన తెలుగు గడ్డపై పల్లెటూరి జనాలు ట్రాక్టర్లు, ఎడ్ల బళ్లు వేసుకువచ్చి థియేటర్లో సినిమా చూడడం అనేది ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు ఆ ట్రెండ్‌ను అఖండ కంటిన్యూ చేసింది.
ఏపీలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని మండల కేంద్రాల్లో అఖండ ఆడుతోన్న థియేటర్లకు ఇలాగే ట్రాక్టర్లు, బళ్లలో తరలి వచ్చి మరి పల్లెటూరి జనాలు అఖండ సినిమా చూశారు. థియేటర్లలోనే రు. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టిన అఖండ ఓవరాల్‌గా రు. 93 కోట్ల నెట్ రాబట్టింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా కలుపుకుంటే ఈ సినిమాకు రు. 200 కోట్ల వసూళ్లు వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో టాప్ -10లో అఖండ 7వ స్థానంలో నిలిస్తే.. బాలయ్య కెరీర్ పరంగా టాప్ ప్లేసులో ఉంది.
మొత్తానికి అఖండ దెబ్బతో బాలయ్య – బోయపాటిది హ్యాట్రిక్ కాంబినేషన్ అని ఫ్రూవ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 125 రోజులు దాటుతున్నా గుంటూరు జిల్లా చిలకలూరిపేట లాంటి చోట్ల ఇంకా డైరెక్టుగా 4 షోలతో రన్ అవుతోంది. తాజాగా విజయవాడలోనే రెండు థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అఖండ కొత్త థియేటర్లు వస్తూనే ఉన్నాయి.
ఇక ఓటీటీలోకి వచ్చినా కూడా అఖండను థియేటర్లలో చూసేందుకే ఇష్టపడుతున్నారు. ఇక బయట వీథి తెరలపై అఖండ సినిమా వేస్తుంటే ఆ గ్రామస్తులు అందరూ జాతరలా అఖండ సినిమాను చూస్తున్నారు. ఇక ఓటీటీ డిస్నీ + హాట్ స్టార్‌లో వచ్చిన అఖండ అక్కడ కూడా హిట్ అవ్వడంతో పాటు అదిరిపోయే రికార్డు సొంతం చేసుకుంది.
గతేడాది రిలీజ్ అయిన పలు భాషల సినిమాలు.. అందులోనూ థియేటర్లలో రిలీజ్ కాకుండా… డైరెక్ట్ రిలీజ్ అయినవి.. థియేటర్లలో వచ్చి ఓటీటీలోకి వచ్చిన అన్ని భాషల సినిమాలను కలిపి చూస్తే అఖండ సినిమా సౌత్ ఇండియాలోనే టాప్ పెర్పామర్‌గా రికార్డులకు ఎక్కింది. దీనిని బట్టి చూస్తే బుల్లితెరను కూడా అఖండ ఊపేసిందనే చెప్పాలి.