టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సుమారు నాలుగు దశాబ్దాల నుంచి చిరంజీవి తెలుగు సినిమా రంగాన్ని శాసిస్తూనే ఉన్నారు. ఈ 40 ఏళ్లలో తెలుగులో ఎంతో మంది హీరోలు వస్తున్నారు.. వెళుతున్నారు. కొందరు మాత్రమే నిలదొక్కుకుంటున్నారు. 60 + వయస్సులో కూడా చిరంజీవి సినిమాలు చేస్తుంటే ప్రేక్షకులు ఎగబడి మరి చూస్తున్నారు. చిరు పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇస్తే బ్లాక్‌బస్టర్ చేసేశారు. పైగా అది అప్పటికే కోలీవుడ్‌లో విజయ్ హీరోగా వచ్చి హిట్ అయిన కత్తి మూవీ.
అయినా తెలుగులో ఖైదీ నెంబర్ 150గా తీస్తే మూడు, నాలుగు సినిమాల పోటీని తట్టుకుని రు. 100 కోట్లకు పైగా షేర్ రాబట్టి.. చిరు ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదని ఫ్రూవ్ చేసింది. ఆ తర్వాత సైరా సినిమా కూడా రు. 100 కోట్ల షేర్ కొల్లగొట్టింది. అయితే బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో ఆ సినిమాకు లాభాలు రాలేదు. ఇక ఇప్పుడు చిరు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తనయుడు చెర్రీతో కలిసి నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29న రిలీజ్ అవుతోంది.
ఈ సినిమా తర్వాత వరుసగా చిరు మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. మోహనరాజా దర్శకత్వంలో వస్తోన్న లూసీఫీర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తోన్న భోళా శంకర్, అటు బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు షూటింగ్‌లు సమాంతరంగా నడుస్తున్నాయి. ఈ మూడు సినిమాల కోసం చిరు డే అండ్ నైట్ గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాడట.
ఇటీవల ఒక రోజు ఈ మూడు సినిమాల షూటింగ్‌లోనూ పాల్గొన్నాడట. మామూలుగా ఇప్పుడున్న హీరోలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ చేస్తేనే అలసిపోతుంటారు. అయినా అంత టైం చేయలేమని దర్శకులకు ఓపెన్‌గానే చెప్పేస్తూ ఉంటారు. అయితే చిరు ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చి గంట రెస్ట్ తీసుకుని.. అనంతరం హైదరాబాద్‌కు విమానంలో తిరిగి వచ్చి ఇక్కడ మరో సినిమా షూటింగ్ చేశారట. రాత్రి మూడో సినిమా షూటింగ్‌కు వెళ్లి అక్కడ కూడా కొన్ని సీన్లు పూర్తి చేశారట.
గతంలో సూపర్‌స్టార్ కృష్ణ ఒక్కరు మాత్రమే ఇలా ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసేవారు. ఆయన నటించిన సినిమాలు ఒకే యేడాదిలో ఏకంగా 18 వరకు రిలీజ్ అయ్యాయి. అయితే చిరు ఈ వయస్సులో ఇంత డెడికేషన్‌తో కష్టపడడం చూస్తుంటే నిజంగానే గ్రేట్. అందుకే ఆయన ఈ తరం హీరోలకే కాదు.. ఇప్పటకీ.. ఎప్పటకీ మెగాస్టార్లకే మెగాస్టార్ అనాల్సిందే..!