జూబ్లిహిల్స్‌లో రెండు రోజుల క్రితం తెల్లవారు ఝామున జరిగిన బిగ్ రైడింగ్‌లో పలువురు సెలబ్రిటీల పిల్లలు అడ్డంగా దొరికిపోయారు. సినిమా రంగానికి చెందిన వారి పిల్లలతో పాటు పలువురు రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పిల్లలు కూడా అడ్డంగా బుక్ అయిపోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 150 మంది ఉన్నారు. వీరిలో కొందరు ఒళ్లు మరచిపోయి డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతున్నారన్న ప్రచారమూ బయటకు వచ్చింది. మరి కొందరు సెలబ్రిటీల పిల్లలు అడ్డంగా బుక్ అయిపోయినా కూడా వారి తల్లిదండ్రులు రంగంలోకి వచ్చి వారిని వెనకేసుకువస్తున్నారు. సరే ఎవరి తల్లిదండ్రులకు వారి పిల్లలు తప్పు చేయలేదన్న భావన ఉండడం సహజం.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ జరిగింది. ఓ మెగా డాటర్ రైడింగ్‌లో అడ్డంగా బుక్ అయిపోయింది. పోలీసులకు దొరికేసింది. అయితే ఈమె బ్యాడ్ లక్ అనుకోవాలా ? లేదా ఆ అమ్మాయి అదృష్టం అనుకోవాలో కాని.. ఈ అపప్రద నుంచి ఓ పెద్ద మెగా స్టార్ హీరో కుమార్తె కూడా తృటిలో ఎస్కేప్ అయ్యిందట. లేకపోతే ఆమె కూడా పోలీసుల రైడింగ్‌లో అడ్డంగా దొరికిపోవడంతో పాటు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చేది. దీంతో ఆ హీరో పరువు మరింత పోయినట్లు అయ్యేదని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
జస్ట్ రైడ్ జరగడానికి 20 నిమిషాల ముందే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారట. అయితే ఆమె ఈ పబ్‌లో జరిగిన పార్టీకి తన కజిన్‌తో కలిసే వచ్చిందట. అయితే అర్జెంట్ కాల్ రావడంతో రైడింగ్ జరగడానికి 20 నిమిషాల ముందు వరకు అక్కడే ఉండి.. అప్పుడే తన కారులో వెళ్లిపోయిందట. ఈ ఇద్దరు అక్కా చెళ్లెళ్లకు ఈ పబ్‌కు వెళ్లడం ఎప్పటి నుంచో కామన్ అట. ఎందుకంటే ఇది లేట్ నైట్ వరకు కూడా తెరచి ఉండే పబ్. అయితే నిన్న రాత్రి పోలీసుల రైడింగ్‌లో అక్క తప్పించుకోగా.. చెల్లి మాత్రం అడ్డంగా బుక్ అయిపోయింది.
ఒక వేళ ఈ రైడ్‌లో నిజంగా అక్క కూడా దొరికిపోయి ఉంటే.. ఇక నిన్నంతా సోషల్ మీడియాలో వాళ్ల యాంటీ బ్యాచ్ ఒక్కటే ఆటాడేసుకునేవారు. ఆ హీరోకు ఇది పెద్ద మచ్చగా మిగిలిపోయి ఉండేది. ఏదేమైనా అక్క అలా సేఫ్ అయ్యి అదృష్టవంతురాలు అయ్యింది. చెల్లి అడ్డంగా దొరికేసినా వాళ్ల ఫ్యామిలీ ఎంత వెనకేసుకు వస్తున్నా.. సోషల్ మీడియాలో జరగాల్సిన రచ్చ అయితే జరిగిపోతోంది. దీనిని ఎవ్వరూ ఆపలేరు కదా ?
ఇక ఈ పబ్ కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి అల్లుడు ( కుమార్తె భర్త) ది అంటున్నారు. ఈ పబ్ యజమానులకు రాజకీయ సంబంధాలు ఉండడంతో లేట్ నైట్ వరకు నడిపిస్తూ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అందుకే నిన్నటి వరకు పోలీసులు కూడా ఇటు వైపు తొంగి చూడలేదు. అయితే ఇప్పుడు పోలీసు శాఖలో పై అధికారులు మారడంతో కొత్తగా వచ్చిన వాళ్ల టార్గెట్‌తోనే ఈ రైడ్ చేశారట.