Moviesరణబీర్‌కపూర్ కన్నా ముందు అలియాభ‌ట్‌కు ఉన్న 4 ల‌వ్ ఎఫైర్స్‌...!

రణబీర్‌కపూర్ కన్నా ముందు అలియాభ‌ట్‌కు ఉన్న 4 ల‌వ్ ఎఫైర్స్‌…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో గార్జియస్ బ్యూటీ ఆలియా భట్ ముందు వరుసలో ఉంటుంది. మన పాన్ ఇండియా మూవీ RRR మూవీలో సీత పాత్రలో అద్భుతంగా నటించించి ఈ అమ్మడు. ఇక ఈ స్టార్ హీరోయిన్ రీసెంట్ గానే తన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. చాలా ఏళ్లుగా ఈ అమ్మడు స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ప్రేమలో ఉంది. అంతా అనుకున్నట్టే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కానీ రణబీర్ కపూర్ తో ప్రేమలో పడకముందే.. అలియా అకౌంట్ లో 4 లవ్ ఎఫైర్స్ ఉన్నాయి. ఆ లవ్ ఎఫైర్స్ అన్నీ దాటుకుని వచ్చి, ఈ అందాల బొమ్మ ఇప్పుడు రణబీర్ కపూర్ సొంతం అయ్యింది. ఇంతకీ.. అలియా ప్రేమాయణం నడిపిన ఆ నలుగురు లక్కీ ఫెలోస్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం .

1) అలీ దాదార్కర్:
అలియాకి చిన్నప్పటి నుండి స్నేహితులు ఎక్కువ. అలాంటి స్నేహితులలో ఒకడే అలీ దాదార్కర్. అలియా భట్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే వీరి లవ్ ఎఫైర్ మొదలయింది. అలియా తన మొదటి సినిమా “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్” చేసే సమాయానికి కూడా అలీ దాదార్కర్ తో ప్రేమలో ఉంది. కానీ.. తరువాత కాలంలో అలియా స్టార్ అయిపోవడంతో అలీ దాదార్కర్ తో రిలేషన్ బ్రేక్ చేసుకుంది. త‌రువాత అలీ దాదార్కర్ మరో అమ్మాయిని వివాహం చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయాడు. కానీ.., అలీ దాదార్కర్, అలియా ఇప్పటికీ మంచి మిత్రులుగా ఉండటం విశేషం.

2) సిద్దార్ద్ మల్హోత్రా :
అలియా భట్ మొదటి సినిమా “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్”. ఆ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సిద్దార్ద్ మల్హోత్రా. అయితే.., ఈ సినిమా మేకింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. కానీ.. తమ మొదటి సినిమా సూపర్ హిట్ కావడం, ఆ తరువాత ఇద్దరు పార్టీలు, ఫంక్షన్స్ అంటూ క్లోజ్ కావడం, ఇద్దరు కలసి మళ్ళీ సినిమాలు చేయడంతో వీరి మధ్య ప్రేమ పుట్టుకొచ్చింది. సిద్దార్ద్ మల్హోత్రా విషయంలో అలియా చాలా సీరియస్‌గా లవ్‌లో ఉన్నప్పటికీ.. సిద్దార్ద్ మాత్రం మరో హీరో జాక్వీలిన్ తో కూడా క్లోజ్ గా ఉంటూ వచ్చాడు. ఈ కారణంగానే అలియా భట్ కొన్ని రోజుల తర్వాత సిద్దార్ద్ మల్హోత్రా కి బ్రేకప్ చెప్పేసింది.

3) వరుణ్ ధావన్ :
వరుణ్ ధావన్ – అలియా భట్ బ్రేకప్ గురించి తెలియనివారు ఉండరు. వరుణ్ కూడా “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్” మూవీతోనే కెరీర్ స్టార్ట్ చేశాడు. పైగా.. వరుణ్-అలియా బాల్య స్నేహితులు కూడా. అప్పటికే రెండుసార్లు ప్రేమలో విఫలం అవ్వడంతో అలియా తన గురించి అంతా తెలిసిన వరుణ్ ధావన్ కే మనసు ఇచ్చింది. కానీ.., అలియా తరువాత కాలంలో కరణ్ జోహార్ స్కూల్ లో పెద్ద స్టార్ అయిపోవడంతో వరుణ్ కి దూరం అయ్యింది. వరుణ్ కూడా ఈ రిలేషన్ కి బ్రేకప్ చెప్పి.. మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.

4) కవిన్ మిట్టల్:
మీకు “హైక్ ” మెసెంజర్ యాప్ తెలుసు కదా ? ఆ సంస్థ అధినేతే కవిన్ మిట్టల్, ఈయన తండ్రి సునీల్ భారతీ మిట్టల్ ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ మేన్. ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో కవిన్ మిట్టల్ – అలియా మధ్య పరిచయం ఏర్పడింది. తరువాత కాలంలో వీరిద్దరూ కలసి ట్రావెల్ చేశారు అన్న రూమర్స్ బయటకి వచ్చాయి. అయితే.. కవిన్ మిట్టల్ కాని, అలియా కాని తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటించింది లేదు. ఇలా.. నలుగురి ప్రేమని దాటుకుని, అన్ని బ్రేకప్స్ తరువాత.. అలియా భట్ రణబీర్ కపూర్ సొంతం అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news