Moviesబన్నీకి ఇష్టమైన ఫుడ్ అదే... ఆ సీక్రెట్ రివీల్ చేసిన భార్య...

బన్నీకి ఇష్టమైన ఫుడ్ అదే… ఆ సీక్రెట్ రివీల్ చేసిన భార్య స్నేహారెడ్డి…!

టాలీవుడ్ లో క్యూట్ భార్యాభర్తల్లో అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి జోడి కూడా ఒకటి. అటు బన్నీతో పాటు ఇటు భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియా క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా… ఫోటో షేర్ చేసిన కూడా కామెంట్లు… లైకుల వర్షం లక్షల్లోనే ఉంటుంది. బన్నీ వరుస హిట్లతో టాలీవుడ్ లోనే నెంబర్ వన్ ర్యాంకు కోసం దూసుకుపోతున్నాడు.

రెండేళ్ల క్రితం సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న బన్నీ… గతేడాది డిసెంబర్లో పుష్ప‌ సినిమాతో ఊహించని విధంగా బాలీవుడ్‌లోనూ పాగా వేశాడు. పుష్ప సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాలీవుడ్లోనే ఏకంగా వంద కోట్లు వసూళ్లు కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రు. 365 కోట్ల వసూళ్లు రావడంతో టాలీవుడ్ వర్గాలతో పాటు ఇండియన్ సినిమా వర్గాలు సైతం అయ్యాయి.

బాహుబలి, కే జి ఎఫ్, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలకు బాలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేశారు. అయితే ఈ సినిమాకు ఎలాంటి ప్రమోషన్లు జరగలేదు. అయినా కూడా ఆ సినిమా బ్లాక్బస్టర్ హిట్ కొట్టి రు. 100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టడంతో బాలీవుడ్ ట్రేడ్ వర్గాల‌కు సైతం బన్నీ దమ్ము ఏంటో తెలిసివచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు పుష్పకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా వస్తోంది. సుకుమార్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే.

స్నేహారెడ్డి తాజాగా తన అభిమానులతో ముచ్చటించారు. ఈ ముచ్చట్లలో బన్నీ అభిమానులు స్నేహారెడ్డి ని బన్నీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని బ‌న్నీకి ఇష్టమైన ఆహారం ఏంటి అని అడిగాడు. వెంట‌నే స్నేహారెడ్డి బిర్యానీ అంటే బన్నీకి చాలా ఇష్టమని, బిర్యాని బాగా ఇష్టంగా తింటారు అని చెప్పటం విశేషం. బన్నీ మాత్రమే కాదు హైదరాబాద్ బిర్యానీ అంటే కోలీవుడ్ స్టార్ హీరోలు.. హీరోయిన్లతో పాటు బాలీవుడ్ స్టార్స్ కు కూడా ఎంతో ఇష్టం.

సహజంగానే హైదరాబాదులో ఉండే తెలుగు సినిమా తారలు అందరికీ హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇక బన్నీ- స్నేహారెడ్డి దంపతులు సినిమా షూటింగ్ లో ఏమాత్రం గ్యాప్ వచ్చిన తమ పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బన్నీ పుష్ప 2 సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా కంప్లీట్ చేసి బన్నీతో సినిమాకు రెడీ అవుతారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news