సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోలు, హీరోయిన్లు కెరీర్ ముగిసిపోయాక చాలా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇస్తూ ఉంటారు. ఎంతో స్టార్డమ్ ఎంజాయ్ చేసిన హీరోలు, హీరోయిన్లు కూడా పెళ్లి విషయంలో ఇలా చేయడం పెద్ద షాకింగ్ లాంటిదే. అసలు సౌత్ ఇండియా సినిమా పరిశ్రమను మకుటం లేని మహారాణిలా ఏలేసింది మహానటి సావిత్రి. తెలుగుతో పాటు తమిళంలో తిరుగులేని హీరోయిన్గా దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలేసిన సావిత్రి కోలీవుడ్ సీనియర్ హీరో జెమినీ గణేశన్‌ను సీక్రెట్‌గా పెళ్లాడింది.
అయితే సావిత్రి జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఇదే. అప్పటికే జెమినీ ఓ పెళ్లితో పాటు మరో ఎఫైర్ కూడా ఉంది. అవన్నీ తెలిసి కూడా సీక్రెట్‌గా జెమినీని పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక ఆమె కెరీర్ సర్వనాశనం అయిపోయింది. ఇక స్టార్ హీరోయిన్ శ్రీదేవి సైతం ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ సీనియర్ నటుడు బోనీకపూర్‌ను పెళ్లాడింది. అప్పటికే బోనీ కపూర్‌కు పెళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారు.
శ్రీదేవి ఓకే చెప్పాలే కాని ఆమెను పెళ్లాడేందుకు అప్పట్లో ఎందరో స్టార్ హీరోలు లైన్లో ఉండేవారు. రాజశేఖర్, మురళీమోహన్ లాంటి హీరోలతో శ్రీదేవికి పెళ్లి ప్రపోజల్స్ కూడా వెళ్లాయి. వారిని కాదనుకున్న శ్రీదేవి మిథున్ చక్రవర్తితో సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత మిథున్‌ను కాదని తన కంటే వయస్సులో పెద్దవాడు.. అప్పటికే పెళ్లియిన బోనీని సీక్రెట్‌గా పెళ్లాడింది.
ఇక బాలయ్య ముద్దుల మావయ్య సినిమాలో చెల్లిగా నటించిన సీత ఆ తర్వాత తమిళంలో కూడా చాలాసినిమాలు చేసింది. సీత ముందుగా పార్తీబన్‌ను పెళ్లాడింది. అతడికి విడాకులు ఇచ్చేసి 2010లో సీక్రెట్‌గా సీరియల్ నటుడు సతీష్‌ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అతడికి కూడా దూరమైంది. ఇక బిచ్చగాడు సినిమాతో ఒక్కసారిగా సౌత్‌లో పాపులర్ అయ్యింది హీరోయిన్ సాత్నా టైటస్. సాత్నా సీక్రెట్‌గా ఓ కోలీవుడ్ బయ్యర్‌ను పెళ్లాడింది.
టాలీవుడ్లో పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన శ్రీయా చరణ్ రష్యాకు చెందిన బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోషివ్ను సీక్రెట్‌గా పెళ్లాడింది. టాలీవుడ్ నటి రమ్యకృష్ణ కూడా దర్శకుడు కృష్ణవంశీని 2003లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ పక్కన సుస్వాగతం సినిమాలో హీరోయిన్గా చేసిన దేవయాని సైతం దర్శకుడు రాజ్‌కుమార్‌ను ప్రేమ వివాహం సీక్రెట్‌గా చేసుకుంది.