బాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో అర్జున్ కపూర్ – ముదురు ఐటెం గాళ్ మలైకా అరోరా ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిన విషయమే. గత నాలుగేళ్లుగా ఈ ప్రేమపక్షులు భారత్‌లోనే కాదు.. విదేశాల్లోనూ.. ముఖ్యంగా యూరప్‌లో సముద్రపు బీచ్‌ల్లో చేసే బోల్డ్ ఎంజాయ్మెంట్, రచ్చ మామూలుగా ఉండడం లేదు. వీరు ప్రేమించుకోవడం తప్పు కాదు.. వీరి మధ్య వయస్సు అంతరమే పెద్ద హాట్ టాపిక్. అర్జున్ కపూర్కా ఇంకా పెళ్లి కాలేదు.. పైగా సినిమాల్లో బోల్డెంత భవిష్యత్తు ఉన్న హీరో. అటు మైలకాకా పెళ్లయ్యింది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
పైగా ఆమె వయస్సు 50కు దగ్గర్లో ఉంది. అర్జున్ ఏజ్ జస్ట్ 35. అంటే వయస్సులోనే వీరి మధ్య 15 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ ఏజ్ గ్యాప్ గురించే ఈ జంట ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది. అయినా కూడా ఎంత ఘాటు ప్రేమయో అన్నట్టుగా వీరు బోల్డ్ రొమాన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. వీరు మాత్రం ప్రేమకు మనస్సులు కలవాలే కాని.. వయస్సుతో సంబంధం ఉండదని చెపుతున్నారు.
ఓ వైపు ఈ జంట పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలతో పాటు మరోవైపు వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. వీరు విడిపోతున్నారని.. మలైకా కూడా అర్జున్ ఇంటికి వెళ్లడం లేదని ఇలా రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఎన్ని పుకార్లు వస్తున్నా వీరు మాత్రం డేటింగ్, పబ్లిక్ రొమాన్స్, సోషల్ మీడియా రొమాన్స్ మాత్రం ఆపడం లేదు. అయితే ఈ గాసిప్‌లపై స్పందించిన అర్జున్ కపూర్ ఈ పనికిమాలిన పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టాలని సూచించాడు.
ఇది మా సరిహద్దు.. ఇప్పుడు మేం కలిసి ఉన్నాం అని చెప్పడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ పుకార్లకు చెక్ పడినట్టు అయ్యింది. ఇక వీరి తాజా ఫొటో చూస్తే వీరు ఎంత గాడమైన ప్రేమలో మునిగిపోయారో తెలుస్తోంది. మలైకా చిన్న వైట్ స్కర్ట్, వైట్ బ్రా టైప్ జాకెట్ వేసుకుని.. అర్జున్ బిగి కౌగిలిలో బంది అయిపోయింది. అర్జున్ మలైకాను గట్టిగా వాటేసుకుని ఆమె నుదిటిపై ముద్దు పెడుతున్నాడు. ఈ ఫొటో చూస్తేనే వీరు ఎంత ఘాటు, ఘాడమైన ప్రేమలో ఉన్నారో అర్థమవుతోంది.
ఇక అర్జున్ సినిమాల విషయానికి వస్తే సైఫ్ ఆలీఖాన్ – యామీ గౌతమ్ – జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి భూత్ పోలీస్ లో చివరిసారిగా కనిపించాడు. ప్రస్తుతం ఏక్ విలన్ రిటర్న్స్ లో నటిస్తున్నాడు . మోహిత్ సురే హెల్మ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమాలో జాన్ అబ్రహం – దిశాపటానీ – తారా సుతారియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.