20 ఏళ్ల క్రితం శాంతినివాసరం సీరియల్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు రాజమౌళి ప్రపంచ గర్వించదగ్గ డైరెక్టర్ అవుతాడని.. ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ శాంతినివాసం సీరియల్‌తో రాజమౌళి అప్పుడే లక్షలాది మంది బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ప్రారంభమైన రాజమౌళి విజయ ప్రస్థానం ఇప్పుడు త్రిబుల్ ఆర్ వరకు ఎక్కడా అపజయం అన్నదే లేకుండా కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు రాజమౌళి దేశం మెచ్చిన దర్శకుడే కాదు.. ప్రపంచం మెచ్చిన దర్శకుడు అయ్యాడు.
త్రిబుల్ ఆర్ సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తోన్న రాజమౌళి నెక్ట్స్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో జేమ్స్‌బాండ్ స్టైల్ కథాంశంతో ఈ సినిమా రానుందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాజమౌళి చదివింది ఇంటర్ మాత్రమే. ఇంటర్ మాత్రమే చదివిన దర్శకుడికి ఇంత గొప్ప విజన్ ఉందా ? రాజమౌళియేనా ? ప్రపంచం మెచ్చే సినిమాలు తీస్తోంది ? అన్న సందేహాలు చాలా మందికే ఉన్నాయి.
అయితే ఇది నిజం.. అసలు రాజమౌళి స్వస్థలం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు. కొవ్వూరులో రాజమౌళి వాళ్ల ఇంటి పేరు కోడూరు పేరు మీద కోడూరు వారి వీథి కూడా ఉంది. వీళ్లదో అప్పట్లో పెద్ద ఫ్యామిలీ. అయితే వీళ్లు తుంగభద్రా నది కాలువలు తవ్వకా ఫ్యామిలీ అంతా రాయచూర్ వెళ్లిపోయి అక్కడ భారీ ఎత్తున పొలాలు కొనుగోలు చేసింది. కొన్నాళ్ల తర్వాత సినిమా పిచ్చితో ఫ్యామిలీ చెన్నై షిఫ్ట్ అవ్వడం.. ఇటు వ్యవసాయాలు కలిసిరాక ఇటు సొంతంగా చేసిన సినిమాలు అపజయం పాలవ్వడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అయితే రాజమౌళి రాయచూర్‌లో పుట్టినా ఇంటర్ మాత్రం సొంత జిల్లాలోని ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజ్‌లో చదివారు. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ తాను ఇంటర్ సర్టిఫికెట్ల కోసం కాలేజ్‌కు వెళ్లినప్పుడే నాగార్జున శివ సినిమా రిలీజ్ అయ్యిందని.. అప్పుడు యువత అంతా శివ సినిమా మానియాలో మునిగి తేలిందని.. ఎవరి నోట విన్నా శివతాండవమే అని నాటి స్మృతులు గుర్తు చేసుకున్నారు.
ఇక రాజమౌళి ఇంటర్ చదువుపై భార్య రమా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో సెటైర్లు , పంచ్‌లు వేశారు. రాజమౌళి ఏం చదువుకున్నారు ? అని ఆమెను ప్రశ్నిస్తే ఇంటర్ చదివానని నాతో చెపుతాడని.. అయితే ఆ ఇంటర్ సర్టిఫికెట్లు ఎప్పుడు అడిగినా లేవని చెపుతాడని.. ఆ సర్టిఫికెట్లు కాని.. టీసీలు కాని ఎప్పుడు తనకు చూపించలేదని ఆమె నవ్వుతూ చెప్పింది. అయితే ఆ టీసీలు ఇన్నేళ్లో ఎక్కడో చోట మిస్ అయిపోయి ఉండవచ్చు.. దానిపై సరదాగా ఆమె సెటైర్ వేసినట్లు ఉంది.