హమ్మయ్యా ఎట్టకేలకు నాలుగేళ్లుగా ఊరిస్తూ ఊరిస్తూ వస్తోన్న త్రిబుల్ ఆర్ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. సినిమాపై ముందు నుంచి ఉన్న భారీ అంచనాలతో పోలిస్తే తగ్గిందని కొందరు అంటున్నారు. అయితే బాహుబలి ది కంక్లూజన్ సినిమాతో పోల్చి చూడడంతో కాస్త తగ్గినట్టు ఉన్నా ఓవరాల్‌గా మాత్రం సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ అయ్యింది అంటేనే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతోంది.
ఇక మనదేశంలో గత వారం రోజులుగా భారీ ఎత్తున ప్రి బుకింగ్స్ జరిగాయి. నార్త్‌లో మినహా ఇస్తే ఏపీ, తెలంగాణతో పాటు ఇటు సౌత్‌లో కర్నాటక, తమిళనాడులోనూ ఈ సినిమాపై ఎక్కడా లేని క్యూరియాసిటీ నెలకొంది. ఏపీ, తెలంగాణలో అయితే మూడు రోజుల పాటు అసలు టిక్కెట్లు లేవు. అన్ని థియేటర్లలోనూ ఈ సినిమా వేసినా మొత్తం బుక్ అయిపోయాయి.
ఇక ఓవర్సీస్‌లో 20 రోజులకు ముందు నుంచే త్రిబుల్ ఆర్ మాస్ జాతర మొదలైపోయింది. రిలీజ్‌కు ముందే కేవలం అడ్వాన్స్ బుకింగ్‌లతోనే 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఈ రోజు ఫస్ట్ డే ముగియకుండానే ఓవర్సీస్‌లో 3 మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసేసింది. రిలీజ్ ఫస్ట్ డే.. అది కూడా ఫస్ట్ షో పడకుండానే వచ్చిన వసూళ్లు ఇవి.
కేవలం ఓవర్సీస్ ప్రీమియర్ వసూళ్ల విషయంలో మాత్రమే కాదు.. ఇటు ఇండియాలో కూడా ఈ సినిమా ఆల్ టైం రికార్డు సెట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. ఓవర్సీస్‌లో షో పడకకుండానే 3 మిలియన్ డాలర్ల వసూళ్లు అంటే ఈ సినిమా బాక్సాఫీస్ హంట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా రైట్స్ రు. 65 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక ఫస్ట్ డే వసూళ్లు వస్తే కాని ఓవర్సీస్లో త్రిబుల్ ఆర్ విధ్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియదు.