MoviesRRR థియేట‌ర్లో ఉపాస‌న అల్ల‌రి పిల్ల అయిపోయిందే (వీడియో)..!

RRR థియేట‌ర్లో ఉపాస‌న అల్ల‌రి పిల్ల అయిపోయిందే (వీడియో)..!

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన విజువల్ వండర్ ట్రిపుల్ ఆర్ ఈ రోజు భారీ ఎత్తున థియేట‌ర్ల‌లోకి దిగింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న థియేట‌ర్లు గ‌త మూడేళ్లుగా స‌రైన సినిమాలు లేక‌.. ప్రేక్ష‌కులు రాక‌.. ద‌మ్మున్న బొమ్మ ప‌డ‌కుండా నిస్తేజంగా ఉన్నాయి. అలాంటి టైంలో వ‌చ్చిన త్రిబుల్ ఆర్ దెబ్బ‌తో దేశ‌వ్యాప్తంగానే థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. ఇక ఏపీ, తెలంగాణ‌లో గ‌త అర్ధ‌రాత్రి నుంచే బెనిఫిట్ షోలు, ప్రీమియ‌ర్ల‌తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతున్నాయి.

ఈ ఒక్క రోజే ఏకంగా 7-8 షోలు ఒక్కో థియేట‌ర్లో ప‌డ‌బోతున్నాయి. ఓవ‌రాల్‌గా చూస్తే శ‌ని, ఆదివారాల‌తో కూడా క‌లుపుకుంటే అన్ని షోల టిక్కెట్లు హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇక రాజ‌కీయ నాయ‌కుల నుంచి, సినిమా సెల‌బ్రిటీల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు కూడా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఫ‌స్ట్ డే సినిమా చూసేందుకు టిక్కెట్ల కోసం మామూలుగా క‌ష్ట‌ప‌డ‌డం లేదు. థియేట‌ర్ల మేనేజ‌ర్ల‌కు అప్పుడే ఒత్తిళ్లు మొద‌లైపోయాయి.

సినిమాకు హిట్ టాక్ ఉండ‌డంతో పాన్ ఇండియా రేంజ్ లో ఇక రికార్డుల మోత మోగుతుందంటూ ట్రేడ్ వ‌ర్గాలు కూడా చెపుతున్నాయి. ఇక ఎన్టీఆర్ ఎన్టీఆర్ – కల్యాణ్ రామ్ సోదరులు, ఎన్టీఆర్ త‌ల్లి షాలిని క‌లిసి ఏఎంబీ మాల్లో బెనిఫిట్ షోను వీక్షించారు. ఇక ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, హీరో రామ్‌చ‌ర‌ణ్ ముందునుంచి అనుకున్న‌ట్టుగానే కూక‌ట్‌ప‌ల్లి భ్ర‌మ‌రాంబ థియేట‌ర్లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వీక్షించారు.

 

ఇక ఈ షోకు రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, భార్య ఉపాస‌న కూడా వ‌చ్చారు. థియేట‌ర్లో అయితే రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఆమె అభిమానిగా మారిపోయి అభిమానుల‌తో క‌లిపి స్క్క్రీన్‌పైకి పేప‌ర్లు విసురుతూ.. వెన‌కాల కూర్చున్న చ‌ర‌ణ్ పై కూడా పేప‌ర్లు చ‌ల్లుతూ అల్ల‌రి పిల్ల మాదిరిగా బాగా సంద‌డి చేశారు. ఉపాస‌నే అంత ఎంజాయ్ చేస్తుంటే ఇక ఫ్యాన్స్ ఆగుతారా ? వాళ్లు కూడా ఆమెతో క‌లిసి పిచ్చ పిచ్చ‌గా ఎంజాయ్ చేశారు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. గ‌త యేడాది ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు నిర్మాత దిల్ రాజు సైతం స్క్రీన్ పై పేపప్లు చించి విసిరేస్తూ చేసిన హంగామా అందరికి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కూడా అంతే స్థాయిలో హంగామా చేసింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news